మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు.. మీ స్నేహితుడు లేదా బంధువు చేతులెత్తేయడం మీరు చూస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితులు మీరు చాలానే ఎదుర్కుని ఉంటారు. అయితే ఇలాంటి స్థితిలో కేవలం ఆధార్ కార్డుతో రూ. 10 వేలు లోన్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఆసక్తికర విషయమేంటంటే.. దీన్ని ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేదు. మీ సౌలభ్యం ప్రకారం వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. అలాగే, ఈ రూ.10,000 రుణానికి ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మరి ఆ వివరాలు చూసేద్దామా..
ఇది చదవండి: కమ్మటి సమోసాలో మెరుస్తూ కనిపించింది.. ఏంటా అని చూడగా.. అమ్మబాబోయ్.!
ఆధార్ కార్డ్ లోన్..
ఆధార్ కార్డుపై లభించే రూ.10,000 రుణాన్ని పర్సనల్ లోన్ అంటారు. ఈ లోన్ కోసం ఎలాంటి వ్యక్తిగత పత్రాలను అడగరు. కేవలం ఆధార్ కార్డును మాత్రమే చూపించాలి. ఆ వెంటనే రూ.10,000 మీ ఖాతాకు బదిలీ అవుతాయి. మీరు ఆధార్‌తో పాటు పాన్ కార్డును కూడా ఉపయోగిస్తే, అధిక మొత్తంలో రుణాన్ని కూడా పొందవచ్చు.
ఇవి కూడా చదవండి
ఆధార్ కార్డుపై రుణం ఎవరు ఇస్తారు?
ప్రభుత్వ బ్యాంకులు వ్యక్తిగత రుణాలను అందించడం చాలా తక్కువ. మీ క్రెడిట్ స్కోర్ బాగుంటే, మీరు రుణం కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాన్ కార్డును ఉపయోగిస్తే, ప్రైవేట్ బ్యాంకులు సులభంగా వ్యక్తిగత రుణాలను ఇస్తాయి. మీకు పాన్ కార్డ్ లేకపోతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పర్సనల్ లోన్ తీసుకోవచ్చు.
ఇది చదవండి: కలలో చనిపోయిన వ్యక్తులు కనిపిస్తే దాని అర్ధం ఏంటో తెల్సా
ఎలా దరఖాస్తు చేసుకోవాలి..
మీకు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, మీరు ఆధార్ కార్డ్ సహాయంతో దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, దీనిలో మీరు NBFC(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ), ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్ యాప్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. ఆధార్ కార్డు, అవసరమైన వివరాలను అందించడం ద్వారా మీరు సులభంగా వ్యక్తిగత రుణం తీసుకోవచ్చు.
ఈ రుణానికి అర్హతలు ఏంటి.?
ఆధార్ కార్డ్ సాయంతో, 21 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో, ఉద్యోగం లేదా సొంత వ్యాపారం ఉన్న వ్యక్తులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు, మీరు యాక్టివ్ బ్యాంక్ ఖాతాను కూడా కలిగి ఉండాలి.
ఇది చదవండి: రణ్‌బీర్‌తో ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయినా.? అందాలతో గత్తరలేపుతోందిగా
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి