ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. టాక్ షోస్, సింగింగ్ షోస్, ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన సినిమాలను అడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. ఈ క్రమంలోనే భారతీయ పురాణాలు, ఇతిహాసాలపై సినిమాలు తెరకెక్కించేందుకు దర్శకనిర్మాతలు కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సినీ ప్రియులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి విభిన్నమైన అనుభూతిని కలిగించే మైథాలాజికల్ థ్రిల్లర్ మూవీస్ ఆద్యంతం సినీప్రియులను కట్టిపడేస్తాయి. అందుకే ఇప్పుడు ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ సైతం ఇలాంటి తరహా జానర్ మూవీస్ వెబ్ సిరీస్ నిర్మించేందుకు సిద్ధమయ్యింది. నిత్యం తెలుగులో డిఫరెంట్ కంటెంట్ చిత్రాలతో అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు కొత్త వెబ్ సిరీస్ ప్రకటించింది. దీపావళి పండగ సందర్భంగా ‘చివంజీవ’ పేరుతో మైథాలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది ఆహా టీమ్.
ఆ పోస్టర్ లో ఎద్దు శివనామాలతో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుండగా.. రోడ్ పై ఓ యువకుడిని వెనుకనుంచి చూపించారు. చిరంజీవ పోస్టర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటూ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ అంటూ చిరంజీవ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సిరీస్ సినీ ప్రియులను పురాణాల ప్రపంచానికి తీసుకెళ్తుందని ఆహా టీమ్ తెలిపింది. ఈ సిరీస్ లో నటించే నటీనటుల గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సిరీస్ ను ఏ రాహుల్ యాదవ్, సుహాసిని నిర్మిస్తుడంగా.. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఈ సిరీస్ కు అభినయ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. గేమ్ చేంజింగ్ వెబ్ సిరీస్‌గా వస్తోన్న చిరంజీవ డిసెంబర్ 2024లో స్ట్రీమింగ్ కానుందని తెలిపారు.
వచ్చే నెలలో ఈ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా వెల్లడించలేదు. ఈ సిరీస్ అప్డేట్స్ మరిన్ని రోజుల్లో తెలియజేయనున్నారు. మరోవైపు నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్ 4 విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కాగా.. ఇప్పుడు మూడో ఎపిసోడ్ కోసం అడియన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.