కాలం చెల్లిన పాత వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువగా ఏర్పడుతున్న నేపథ్యంలో వాటిని ప్రభుత్వం నిషేధించింది. ప్రస్తుతం భారత్ స్టేజ్ 6 (బీఎస్ 6) ఫేజ్ 2 దశ మన దేశంలో నడుస్తోంది. వీటి నిబంధనలకు అనుగుణంగా కొత్త వాహనాలను విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాహనాల వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వాహనం నుంచి కాలుష్యం తక్కువగా ఉందని నిర్ణారణ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి. వాహనాల యజమానులందరూ పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ కలిగి ఉండాలి. తద్వారా దీనివల్ల రోడ్లపై వాహనాన్ని చెక్కింగ్ చేసినప్పుడు జరిమానాల నుంచి తప్పించుకోవచ్చు. పర్యావరణానికి నష్టం లేకుండా వ్యవహరించే వీలుంటుంది. కింద తెలిపిన మరికొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ వాహనాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచాలి. దాని కోసం నిరంతరం మెయింటినెన్స్ చేయాలి. తద్వారా కాలుష్యానికి కారణమయ్యే పదార్థాలు మీ వాహనం నుంచి విడుదల కావు. ముఖ్యంగా ఎగ్జాస్టులు, ఆయిల్ మార్పులు, ఎయిర్ ఫిల్టర్లను క్రమతప్పకుండా పరిశీలించాలి. అవసరమైన వాటిని మార్పులు చేయాలి. పీయూసీ సర్టిఫికెట్ ఉంటే ప్రయాణ సమయంలో ఎలాంటి ఆందోళన ఉండదు.
వాహనంలో వినియోగించే పెట్రోలు లేదా డీజిల్ కూడా తక్కువ కాలుష్యాన్ని వెలువడటానికి ప్రధాన కారణంగా ఉంటుంది. సాధారణ ప్రామాణిక నాణ్యత కలిగిన ఇంధనం కంటే ప్రీమియం నాణ్యత ఇంధనాన్ని ఎంచుకోవడం చాలా అవసరం. అధిక ఆక్టేన్ స్థాయి, మెరుగైన లూబ్రిసిటీ ఉన్న ఇంధనానికి ఖర్చు ఎక్కువగానే అవుతుంది. కానీ పర్యావరణానికి మేలు జరుగుతుంది. మీరు డ్రైవింగ్ చేసే విధానంపై కూడా కాలుష్య స్థాయి ఆధార పడుతుంది. అన్ని చక్రాలపై పడుతున్న ఒత్తిడిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. తక్కువ టైర్ ప్రెజర్ కారణంగా ఎక్కువ ఇంధనం ఖర్చవుతుంది. తద్వారా ఎక్కువ కాలుష్యం విడుదల అవుతుంది. అలాగే మైలేజీ పడిపోతుంది.
కారులో ఎయిర్ కండీషన్ సిస్టమ్ ను పొదుపుగా వినియోగించాలి. ప్రయాణంలో మీకు అవసరమైనప్పుడు మాత్రమే వేసుకోవాలి. తద్వారా మీ వాహనం నుంచి కాలుష్య ఉధ్గారాలు చాలా తక్కువగా విడుదలవుతాయి. సాధారణంగా చలికాలంలో ఏసీని వాడరు. అదే సమయంలో హీటర్ ను వాడడం వల్ల ఎక్కువ కాలుష్యం విడుదల అవుతుంది. కార్ పూలింగ్ అనే విధానం కూడా కాలుష్యాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ విధానంలో రోజూ తక్కువ సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వస్తాయి. ఒకే కారులో ఎక్కువమంది ప్రయాణం చేస్తారు. వంతుల వారీగా కార్లు బయటకు తీస్తారు. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా సీఎన్ జీ వాహనాలను వినియోగించాలి. అనేక కంపెనీలు కూడా సీఎన్ జీ వాహనాలను విడుదల చేస్తాయి. ఇవి కాలుష్యాన్ని తగ్గించడానికి ఎంతో దోహదపడతాయి. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా మరో మంచి ప్రత్యామ్నాయం.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి