రీసెంట్ గా అక్కినేని ఇంట పెళ్లి బాజాలు మోగాయి. అక్కినేని నాగచైతన్య , శోభిత వివాహం ఇటీవలే గ్రాండ్ గా జరిగింది. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య శోభితతో ప్రేమలో పడ్డాడు. ఈ ఇద్దరూ చాలా రోజులు తమ ప్రేమను రహస్యంగా ఉంచారు. ఆతర్వాత పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీగా మారిపోయారు. ఇక ఇప్పుడు మరోసారి అక్కినేని ఇంట పెళ్ళిసందడి మొదలవనుంది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇటీవలే జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది.
ఇది కూడా చదవండి :చిట్టి గుమ్మా.. ఇన్నిరోజులు ఏమైపోయావమ్మా..! ప్రేమకథ చిత్రం హీరోయిన్ను చూశారా..!
హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. అక్కినేని అఖిల్ నిశ్చితార్థం విషయాన్నినాగార్జునే స్వయంగా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అఖిల్ , జైనాబ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ హ్యాపీ న్యూస్ చెప్పారు. కాగా ఇప్పుడు అఖిల్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది.
ఇది కూడా చదవండి :ఎంత కష్టం వచ్చింది భయ్యా..! ఈ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా.? ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే
మార్చి24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే ఇరు కుటుంబాలు దీని గురించి చర్చలకు కూడా జరుపుకొని తేదీని ఫిక్స్ చేశారని టాక్. అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు నాగార్జున ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. సినీ సెలబ్రెటీలు , రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. ఇప్పుడు ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. ఈ వివాహం కోసం అక్కినేని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. కాగా గతంలో అఖిల్ ఓ అమ్మయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.