అమరన్ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్‌పై పెట్రోలు బాంబు పేలిన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. తెలుగు, తమిళంలో భాషలలో ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. ముఖ్యంగా తమిళనాడులోని అత్యధిక థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాకు మొదటిరోజు నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి. తమిళనాడులోని తిరునల్వేలి మేలపాళయం ప్రాంతంలోని థియేటర్‌లో అమరన్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ క్రమంలోనే శనివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు నెల్లై థియేటర్ పై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించిన సీసీ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునల్వేలి మేలపాళయం ప్రాంతంలోని నెల్లై థియేటర్లో అమరన్ సినిమా విజయవంతంగా రన్ అవుతుంది. అయితే మొదటి నుంచి ఈ సినిమాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు కొందరు వ్యక్తులు. ఈ క్రమంలోనే శనివారం (నవంబర్ 16న) తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇద్దరు దుండగులు ఈ థియేటర్‌పై పెట్రోల్ బాంబు విసిరారు. ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తెల్లవారుజాము కావడంతో ఆ ప్రాంతంలో జనం లేరు. అలాగే థియేటర్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు విచారణ జరుపుతున్నారు. పారిపోయిన ఇద్దరు వ్యక్తుల కోసం కూడా పోలీసు శాఖ వెతుకుతోంది.
ఇప్పటి వరకు తమిళనాడు వ్యాప్తంగా అమరన్ సినిమా ఆడుతున్న థియేటర్ల ముందు ఎస్టీబీఐ పార్టీ నిరసన చేపట్టింది. ఈ సినిమాలో కాశ్మీర్‌లోని ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించడంతో వ్యతిరేకత మొదలైంది. గతవారం నెల్లాలోని మేళ్లపాలెంలో ఇదే థియేటర్ ఎదుట ఎస్‌టీబీఐ పార్టీ నిరసనకు దిగింది. తిరునెల్వేలి మేలపాళయం ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతం.
ఇవి కూడా చదవండి
ఇది చదవండి : Tollywood: వార్నీ.. ఏందీ బాసూ ఈ అరాచకం.. పద్దతిగా ఉందనుకుంటే గ్లామర్ ఫోజులతో హీటెక్కిస్తోందిగా..
Tollywood: ఇరవై ఏళ్లపాటు స్టార్ హీరోయిన్.. బాత్రూమ్ గోడలో రూ.12 లక్షలు దొరకడంతో కెరీర్ నాశనం..
Chandamama: దొరికిందోచ్.. టాలీవుడ్‌కు మరో చందమామ.. ఈ హీరోయిన్ కూతురిని చూశారా.. ?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.