నవ మాసాలు మోసి కని పెంచిన కన్నతల్లిని ఓ కూతురు భారంగా భావించింది.. జాలి , దయ ,కనికరం లేకుండా మతిస్థిమితం లేని వృద్ధురాలిని ఓ వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్ళిపోయింది.. కానీ ఆశ్రమం వారుకూడా లోపలికి అనుమతించలేదు.. దింతో ఆకలితో అలమటిస్తూ తన బిడ్డ వస్తుందని ఆ వృద్ధురాలు రోడ్డుపైనే ఎదురుచూస్తూనే ఉండిపోయింది.. ఇప్పుడు ఈఘటన విజయవాడలో అందరిని కలచివేస్తుంది..
సొంత తల్లిదండ్రులను భారంగా భావిస్తూ.. వదిలివేస్తున్న ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాము.. నవ మాసాలు మోసి కని పెంచిన కన్న అమ్మను ఓ కుమార్తె భారంగా బావించింది. కొంచెం అంటే కొంచెం కూడా దయ లేకుండా మతిస్థిమితం లేని అమ్మను వృద్ధాశ్రమం వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఆశ్రమం వారి సైతం ఆమెను లోపలి రానివ్వలేదు. దింతో ఆకలితో అలమటిస్తూ.. తన కూతరు కోసం ఎదురు చూస్తూ ఉండిపోయింది. ఈ హృదయవిదారకర సంఘటన విజయవాడ పాయకాపురంలో చేటుచేసుకుంది…
గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె అల్లారు ముద్దుగా తనను పెంచి పోషించింది. అంతే కాదు మంచి చదువును కూడా చదింవించింది. అంతరం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన ఆవాసాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కాని ఆ తల్లి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించింది. కొన్ని రోజుల క్రితం విజయవాడలోని మున్సిపల్ వృద్దాశ్రమంలో చేర్పించింది. ఇటీవల బుడమేరుకు వచ్చిన వరదల సమయంలో ఆమెను కుమార్తె , అల్లుడు ఇంటికి తీసుకువెళ్లారు. వృద్ధురాలిని ఆశ్రమం వద్దకు తీసుకురావొద్దని చెప్పడంతో కుమార్తె వద్ద ఉంటుంది.
నిన్న శుక్రవారం ఓ బైక్ పైన తీసుకువచ్చి వృద్ధాశ్రమం వద్ద వదిలి వెళ్లిపోయారు. దీన్ని గమనించిన వృద్ధాశ్రమం నిర్వాహకులు ఆమెను లోపలి రావివ్వలేదు.. ఏమి జరుగుతుందో తెలియని ఆతల్లి ఆశ్రమం గేటు పట్టుకొని అక్కడే ఉండిపోయింది. వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ దిన స్థితిలో ఉన్న ఎవ్వరూ ఆమెను పట్టించుకోలేదు. వృద్ధురాలిని నిర్బంధంగా తీసుకువచ్చి ఆశ్రమ గేటు వద్ద వదిలివెళ్ళిపోయారని అక్కడి స్థానికులు చెబుతున్నారు..వృద్ధురాలి కూతురికి ఫోన్ చేసిన స్పందించడం లేదని అంటున్నారు..
వృద్ధురాలిని ఆశ్రమంలో చేర్చుకోవాలని అక్కడకి వచ్చిన స్థానికులు నిర్వాకులకు విజ్ఞప్తి చేశారు. అయినప్పటికీ ఆశ్రమం సిబ్బంది ససేమిరా అన్నారు.. దింతో మున్సిపల్ శాఖ నిర్వహిస్తూన్నా నిర్వాహకురాలిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.