10 ఏళ్ల తరువాత ఒక వైపు కొబ్బరి ధరలు పెరిగిందని, మరొక వైపు కొబ్బరి దిగుబడి పెరిగిందని కొబ్బరి రైతులు సంతోషించే సమయంలో ఒక్కసారిగా కొబ్బరి చెట్ల ఆకులకు తెల్ల దోమ చేరి ఆకులుకున్న పత్ర హరితమంతా హరించి వేయడంతో కొబ్బరి చెట్లు నల్లగా మారి మొవ్వులు ఊడిపోతున్నాయని కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తెల్ల దోమ తెగులు పై దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
White Mosquito connected Coconut Trees
కొడుకు కన్నా కొబ్బరి చెట్టు మిన్న అనేది కోనసీమ వాసుల నానుడి. దీనిని బట్టి కొబ్బరి చెట్టు ఎంత విలువైందో అర్థం చేసుకోవచ్చు. ఒక కుటుంబానికి పది కొబ్బరి చెట్లు ఉంటే ఆ కుటుంబ పోషణ సాఫీగా సాగిపోతుందని ఇక్కడి వారి ధైర్యం….అంబాజీపేట పరిశోధనా కేంద్రం రికార్డులు ప్రకారం.. ప్రస్తుతం కోనసీమలో 54వేల హెక్టార్లలో కొబ్బరి పంట పండిస్తున్నట్టు సమాచారం…ఈయేడు వర్ష పాతం ఎక్కువగా ఉండడంతో తెల్లదొమ తెగులు తగ్గి కొబ్బరి దిగుబడి పెరిగిందని ఆశించే సమయంలో మరల తెల్ల దోమ తెగులు కోనసీమ కొబ్బరి రైతుల్లో గుబులు రేపుతోంది.
10 ఏళ్ల తరువాత ఒక వైపు కొబ్బరి ధరలు పెరిగిందని, మరొక వైపు కొబ్బరి దిగుబడి పెరిగిందని కొబ్బరి రైతులు సంతోషించే సమయంలో ఒక్కసారిగా కొబ్బరి చెట్ల ఆకులకు తెల్ల దోమ చేరి ఆకులుకున్న పత్ర హరితమంతా హరించి వేయడంతో కొబ్బరి చెట్లు నల్లగా మారి మొవ్వులు ఊడిపోతున్నాయని కొబ్బరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తెల్ల దోమ తెగులు పై దృష్టి పెట్టి నివారణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
ఇవి కూడా చదవండి