ఆ జంటకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు ఇటీవల వివాహం జరిపించగా.. కుమారుడిని తమ శక్తికి మించి చదివించి, మంచి భవిష్యత్తు ఇవ్వాలని కలలు కన్నారు. బోలెడంత ఫీజు కట్టి ప్రైవేట్ స్కూల్ లో పదో తరగతి చదివిస్తున్నారు. మరో రెండు నెలల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు ఉండగా.. సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన కుమారుడు తిరిగి స్కూల్ కి వెళ్లలేదు. ఈ విషయమై ఆడగగా.. ఆ మరుసటి రోజే ఇంట్లో ఉరికొయ్యకు విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు..
10th Class Student Suicide
కారంపూడి, జనవరి 27: పల్నాడు జిల్లా, కారంపూడి మండలంలోని లక్ష్మీపురానికి చెందిన టెన్త్ విద్యార్ధి బలన్మరణానికి పాల్పడ్డాడు. చదువుల ఒత్తిడి భరించలేక విద్యార్ధి సూసైడ్ చేసుకున్నాడు.. హనుమంతరావు, లక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తెకు వివాహం చేయగా.. కుమారుడు అమర్ (15)ను కారంపూడిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలోని హాస్టల్‌లో ఉంచి 10వ తరగతి చదివిస్తున్నారు. ఈ క్రమంలో సంక్రాంతి సెలవులకు ఇంటికి వచ్చిన కుమారుడు అమర్ పాఠశాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటంతో.. తండ్రి హనుమంతరావు సోమవారం పాఠశాలకు వెళ్లమని చెప్పాడు. అయితే అమర్ ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందాడు. సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు ఇంట్లో ఉరి కొయ్యకు విగతజీవిగా వేలాడుతున్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అమర్ పాఠశాలలో తన తోటి స్నేహితులతో తనకు చదువుకోవడం ఇష్టం లేదని చెప్పాడని, ఈ కారణంగానే మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
రిపబ్లిక్ డే.. ప్రత్యేక ఆకర్షణగా 18 శకటాలు
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 18 శకటాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇందులో నైపుణ్యం.. మానవ వనరుల అభివృద్ధి శకటాలు ప్రథమ బహుమతి సాధించాయి. నాణ్యమైన ఉత్పత్తులు, బ్రాండింగ్ శకటం ద్వితీయ బహుమతి, గ్లోబల్–బెస్ట్ లాజిస్టిక్స్ శకటం తృతీయ బహుమతి దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.