నాగుపాము.. పగ పట్టిందేమో.. లేకుంటే.. ఎందుకు ఎంపిక చేసుకున్నట్లుగా.. కొన్ని ఇళ్లలోకి మాత్రమే వస్తుండటం పట్ల ఆ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. నిద్రలేని రాత్రుల్లో ఎన్నో గడిపారు. మహానంది మండలం తమ్మడపల్లెలో నాగుపాము.. కాలనీవాసులకు నిద్ర లేకుండా చేసింది. తరచుగా కనిపిస్తూ పడగ విప్పుతూ మాయమయ్యేది. పిల్లలు ఉన్న ఇళ్లు అయితే మరీ ఆందోళన చెందేవి. అనుకున్నట్లుగానే మరోసారి అదే నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో కాలనీవాసులు అంతా స్థానికంగా ఉండే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. అతడు చాకచక్యంగా బంధించి దూరంగా అడవిలోకి వదిలిపెట్టడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్నేక్ క్యాచర్‌కి థాంక్స్ చెప్పారు. నిజంగా నాగుపాము పగ పడుతుందా.. లేదా.. అనేదానిపై స్థానికంగా చర్చ జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి