కార్తీక మాసంలో ఒక అద్భుతం జరిగింది. అల్లూరి జిల్లాల్లోని ఓ రైతు పొలంలో శివలింగం బయటపడడంతో భక్తులు పూజలు చేశారు. ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు.
Shivling
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రైతు పొలంలో పనులు చేస్తుండగా శివలింగం బయటపడింది. కొయ్యూరు మండలంలోని రేవళ్లు పంచాయతీ కంఠారం శివారులలోని బంధమామిళ్లకు చెందిన వడగం సత్తిబాబు అనే రైతుకు చెందిన పొలంలో చిన్న సైజు శివలింగం బయల్పడింది. ఆదివారం రైతు పొలంలో పనులు చేస్తున్న సమయంలో ఈ శివలింగం బయటపడినట్లు తెలిసింది. అసలే కార్తీక మాసం కావడం, శివలింగం ప్రత్యక్షం కావడంతో భక్తులు తన్మయత్వంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.