ఇప్పుడు ఎక్కడ చూసినా ఏదో ఒక ప్రాంతంలో చిరుత కలకలం అనే వార్తలు వింటూనే ఉన్నాం .. అయితే ఇక్కడ కూడా పులి కనిపించింది కానీ అయితే అది పొలంలో మృతి చెంది కనిపించింది.. ఏమి చేయాలో తెలియని రైతు దానిని గుట్టు చప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. అయితే ఆ పులి ఎందు మృతి చెందింది అంటే..?
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం రామాపురం గ్రామం సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. అయితే ఆ ప్రాంతంలో గతంలో చిరుతలు సంచరిస్తూ ఉండేవి ఇప్పటికి అక్కడ ఒక ఆడ చిరుత దానికి సంబంధించిన పిల్లలు తిరుగుతున్నాయి అనేది స్థానిక ప్రజల సమాచారం. అయితే స్థానిక గ్రామాల ప్రజలు వారి పొలాలకు రక్షణగా రాత్రి వేళల్లో పొలము చుట్టూ కంచలాగా కరెంటును అమరుస్తారు. ఎటువంటి జంతువులు వచ్చి పంట నాశనం చేయకుండా ఉండడానికి ఆ ప్రాంత రైతులు అలా చేస్తారు.. అయితే గత నాలుగు రోజుల క్రితం భరత్ రెడ్డి అనే స్థానిక రైతు తన పొలానికి కంచలాగా కరెంటు అమర్చాడు. దాంతో ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత ఆ కరెంటు తీగలకు తగిలి చనిపోయింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారి కూడా స్పష్టం చేశారు.. అయితే ఇక్కడ పులి మృతి చెందిన విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయకుండా భయపడిన రైతు దానిని అటవీ ప్రాంత సమీపంలో పూడ్చి పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది.
అయితే కొంతమంది పొలాలలో పులి పాదముద్రలు గుర్తించి అనుమానం వచ్చిన కొంతమంది స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడం వారు అక్కడ పరిశీలించడం స్థానికంగా విచారించడంతో అసలు విషయం బయటపడింది. భరత్ రెడ్డి అనే రైతు తన పొలానికి వేసిన కరెంటు కంచె వలన అటువైపు వచ్చిన చిరుత మృతి చెందిందని, భయపడి తాను మాకు సమాచారం ఇవ్వలేదని అటవీ శాఖ అధికారి వెల్లడించారు.. చనిపోయిన చిరుత పులి వయసు మూడు సంవత్సరాలు ఉంటుందని, చిరుతకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నామని ఏమైనా అవయవాలు అందులో మిస్ అయ్యాయా అనే విషయం పోస్ట్ మార్టం ద్వారా తెలుస్తుందని అటవీశాఖ అధికారి తెలిపారు. పులి సంచరించే ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, జంతువు మృతి చెందినా ఎక్కడ సంచరించినా తెలపవలసిన బాధ్యత వారికి ఉందని, భయపడి ఇలా పూడ్చి పెట్టడం లాంటివి చేస్తే కేసులు నమోదు అవుతాయని తర్వాత శిక్షలు పడే అవకాశం కూడా ఉంటుందని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి