హైదరాబాద్, నవంబర్ 26: హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో అగ్నివీర్ నియామక ర్యాలీలు జరగనున్న సంగతి తెలిసిందే. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌కీపర్, ట్రేడ్స్‌మెన్ పోస్టులను ఈ ర్వాలీ ద్వారా భర్తీ చేస్తారు. డిసెంబరు 8 నుంచి 16వ తేదీ వరకు అగ్నివీర్‌ల రిక్రూట్‌మెంట్ ర్యాలీలను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 33 జిల్లాల నుంచి నిరుద్యోగులు ఎవరైనా ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనవచ్చు. భారత సైన్యంలోకి అగ్నివీర్‌లను చేర్చుకునేందుకు ఈ ర్యాలీలు జరగనున్నాయి. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్‌కీపర్ పోస్టులకు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ట్రేడ్స్‌మెన్ పోస్టులకు ఎనిమిదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి (కరైకల్-యానాం) నుంచి మహిళా మిలిటరీ పోలీస్ అభ్యర్థులు ఈ ఏడాది జారీ చేసిన ఫిబ్రవరి 12 నాటి నోటిఫికేషన్ ప్రకారం అన్ని ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. అయితే బయట కొందరు కేటుగాళ్లు అగ్నివీర్ పోస్టులు ఇప్పిస్తామని దళారులమని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వారి మాటలను నమ్మిమోసపోవద్దు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో నమోదు చేయడానికి, ఉత్తీర్ణత సాధించడానికి సహకరిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మొద్దని రిక్రూట్‌మెంట్ సంస్థ తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి అభ్యర్థులకు ఏవైనా సందేహాలుంటే 040-27740059, 27740205 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలని సూచించింది.
తెలంగాణలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలు.. ఏయే జిల్లాల్లోనంటే ?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 13 నర్సింగ్ కాలేజీలకు పరిపాలన అనుమతి ఇస్తూ వైద్యారోగ్యశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న మెడికల్ కాలేజీలకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, ఆసిఫాబాద్, నిర్మల్, రామగుండం, మెదక్, కుత్బుల్లాపూర్, ములుగు, నారాయణపేట, మహేశ్వరం, నర్సంపేట, భువనగిరి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు మొత్తం రూ.338 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించనుంది.
ఇవి కూడా చదవండి