Telugu Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను స్థిర రాశులుగా పరిగణిస్తారు. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు వారికి తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది.
Telugu Astrology
వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులను జ్యోతిషశాస్త్రం స్థిర రాశులుగా పరిగణిస్తుంది. సాధాణంగా ఈ రాశుల్లో శుభ గ్రహాలు కలిసినప్పుడు తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం వృషభ రాశిలో గురువు, కుంభ రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఈ నాలుగు రాశుల వారి జీవితాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ నాలుగు రాశులతో పాటు ధనూ రాశికి కూడా అత్యంత శుభ ఫలితాలు అనుభవానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ అయిదు రాశుల వారికి నెల రోజుల్లోపల శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది.
- వృషభం: ఈ రాశిలో గురువు, దశమ స్థానంలో శుక్ర, శనుల సంచారం వల్ల ఈ రాశివారికి ఉద్యోగంలోనే కాక సామాజికంగా కూడా ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. సామాజికంగా ప్రముఖులతో పరిచయాలు విస్తరించే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. వారసత్వ సంపద లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.
- సింహం: ఈ రాశికి దశమంలో గురువు, సప్తమ స్థానంలో శుక్ర శనులు రాజయోగాలనిస్తారు. సప్తమ కేంద్రంలో శని స్వస్థాన సంచార కారణంగా ఏర్పడిన శశ మహా పురుష యోగం పూర్తి స్థాయిలో శుభ ఫలితాలనిస్తుంది. సమాజంలో ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడడంతో పాటు, ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంది. ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి ప్రస్తుతం బుధ, రవి, శుక్ర, గురువులు అనుకూలంగా మారడంతో పాటు చతుర్థ కేంద్రంలో శని శశ మహా పురుష యోగాన్ని కలిగిస్తున్నందువల్ల సమాజంలో ఒక ప్రముఖుడుగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తిపాస్తులు లభిస్తాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా హోదా పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి బుధుడు, రవి, శని, శుక్రులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలగడంతో పాటు, వేతనాలు పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. శత్రు, రోగ, రుణ సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. సంతాన యోగానికి కూడా బాగా అవకాశం ఉంది.
- కుంభం: ఈ రాశిలో శుక్ర, శనుల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఈ రాశిలో శని సంచారం వల్ల శశ మహా పురుష యోగం ఏర్పడి, పూర్తి స్థాయి ఫలితాలనిస్తుంది. ఉన్నత వర్గాలతో గానీ, రాజకీయ ప్రముఖులతో గానీ స్నేహాలు బలపడతాయి. పలుకుబడి బాగా పెరిగే అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. వ్యక్తిగత సమస్యల నుంచి దాదాపు పూర్తిగా బయ టపడడం జరుగుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది.