Ather care service plans: ఏథర్ నుంచి అదిరే సర్వీసు ప్లాన్లు.. కస్టమర్లకు పండగే..!

2 hours ago 1

ప్రముఖ ఈవీల తయారు దారు ఏథర్ ఎనర్జీ కూడా తన టూ వీలర్ల కోసం కొత్త సర్వీసు ప్యాకేజీని తీసుకువచ్చింది. వీటి ద్వారా కస్టమర్లకు అనేక సేవలు అందించనుంది. ఏథర్ ఎనర్జీ తీసుకువచ్చిన కొత్త సర్వీస్ కేర్ ప్యాకేజీలు ఆకట్టుకుంటున్నాయి. వీటి ద్వారా విడి భాగాల రీప్లేస్ మెంట్ పై డిస్కౌంట్లు లభిస్తాయి. అలాగే వివిధ పాలిషింగ్, సర్వీసింగ్ సేవలు అందుతాయి. మూడేళ్ల వారంటీ పూర్తవుతున్న ఖాతాదారుల కోసం వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఏథర్ కేర్, ఏథర్ కేర్ ప్లస్, ఏథర్ కేర్ ప్లస్ పేరుతో మూడు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్లాన్ తో తెలిపిన కాల పరిమితి, ఇతర నిబంధనల ప్రకారం ఖాతాదారులందరికీ ఉచితంగా, తగ్గింపు ధరలతో సేవలు అందజేస్తారు.

కొత్తగా వచ్చిన సర్వీసు ప్లాన్లు ఏథర్ ఖాతాదారులందరికీ అందుబాటులో ఉంటాయి. ఒక ఏడాది కాల పరిమితి లేదా పదివేల కిలోమీటర్లలో ఏది ముందుగా వస్తే అప్పటి వరకూ అమల్లో ఉంటాయి. ఏథర్ కేర్ సర్వీస్ ప్లాన్ రూ.1350, ఏథర్ కేర్ ప్లస్ రూ.1630, ఏథర్ కేర్ మ్యాక్స్ రూ.2400కు అందుబాటులో ఉన్నాయి. ఏథర్ కేర్ ప్లాన్ ద్వారా ఖాతాదారులకు రెండు ఉచిత పిరియాడిక్ వెహికల్ సర్వీసులు అందిస్తారు. వేర్ అండ్ టియర్ పార్టులపై ఏడాదికి ఒకసారి పది శాతం తగ్గింపు లభిస్తుంది. అలాగే వీటిని బిగించడానికి లేబర్ చార్జీలపై పది శాతం తగ్గింపు అందిస్తారు.

ఏథర్ కేర్ ప్లస్ ప్లాన్ లో భాగంగా వేర్ అండ్ టియర్ పార్టులపై ఏడాదికి రెండుసార్లు పదిశాతం తగ్గింపు లభిస్తుంది. వాహనానికి ఒకసారి పాలిషింగ్, ఒకసారి వాష్ సెషన్ ను ఉచితంగా అందిస్తారు. వేర్ అండ్ టియర్ పార్టులను బిగించేందుకు కార్మికుల చార్జీలపై ఏడాది రెండుసార్లు తగ్గింపు లభిస్తుంది. అలాగే రెండు ఉచిత పిరియాడిక్ వాహన సేవలు అందుతాయి. ఏథర్ కేర్ మ్యాక్స్ ప్లాన్ ద్వారా రెండు బ్రేక్ ప్యాడ్ రీ ప్లేస్ మెంట్లు, రెండు వాష్ లు, రెండు ఎక్స్ ప్రెస్ కేర్ సేవలు, రెండు పాలిషింగ్ లు, బెల్ట్ లూబ్రికేషన్ ఉచితంగా లభిస్తాయి. కస్టమర్లకు తమకు అనుకూలమైన ప్యాకేజీని ఎంచుకుని సేవలు పొందవచ్చు. ఏథర్ సర్వీసు సెంటర్లు, ఎక్స్ పీరియన్స్ సెంటర్లలో ఈ ప్లాన్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article