నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్ అవతారమెత్తారు. తాను నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రంలోని పాట పాడి ఇటు ఫ్యాన్స్‌ను అటు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులు, అభిమానులను ఉర్రూతలూగించాయి.
చిత్రం బ్లాక్ బస్టర్ విజయంతో చిత్ర బృందం వరుసగా విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇటీవల అనంతపురంలో డాకు మహరాజ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ డాకు మహరాజ్ సినిమాలోని పాట పాడి అభిమానులను అలరించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ సంచలన వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అతి పెద్ద విజయంగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అనంతపురములో అభిమానుల సమక్షంలో డాకు మహారాజ్ విజయోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించిన చిత్ర బృందం, ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ వేడుకలో బాలకృష్ణ స్వయంగా ”గణ గణ గణ ఆంధ్ర తెలంగాణ” పాటను పాడి అభిమానుల్లో ఉత్సాహం నింపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లు అర్జున్ అరెస్ట్‌పై మరోసారి సీఎం రేవంత్ కామెంట్స్
Rashmika Mandanna: ఆ సినిమా తర్వాత రిటైర్ అవ్వాలనుంది.. రష్మిక షాకింగ్ కామెంట్స్
TOP 9 ET News: ఏంటీ.. చరణ్ సినిమాలో మోనాలిసానా? | రూ.200 కోట్లు దాటిన వెంకీ సినిమా కలెక్షన్స్
డబ్బిచ్చి మరీ జైలుకెళుతున్నారు! ఏమిటీ విచిత్రం?
పాఠశాలలో మహిళా టీచర్ తో హెడ్మాస్టర్ రాసలీలలు.. వీడియో వైరల్