చలికాలంలో చర్మం రంగు మారిపోయి నల్లబడినట్లుగా కనిపిస్తుంది. అంతేకాదు.. ముఖం, చర్మం కళావిహీనంగా మారుతుంది. దీంతో ముఖం నీరసంగా, మసకబారినట్లుగా కనిపిస్తుంది. శీతాకాలంలో వీచే చల్లని గాలుల కారణంగా ముఖంలోని తేమను పీల్చి చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది. దీనిని నుంచి తప్పించుకోవడానికి మార్కెట్‌లో దొరికే రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు చాలా మంది అయితే, అవన్నీ కొంతకాలం తర్వాత మీ చర్మాన్ని మరింత నల్లగా మార్చి డ్యామేజ్ చేస్తుంది. అయితే, శీతాకాలంలో చర్మం రంగును తిరిగి పొందటానికి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
బంగాళాదుంప రసం: బంగాళాదుంపలు ప్రతి ఇంట్లో తప్పక అందుబాటులో ఉంటాయి. బంగాళదుంప రసాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారా చర్మంలో ఉన్న నలుపుదనం తొలగిపోతుంది. దీని కోసం ముందుగా బంగాళాదుంపను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు దాని నుంచి రసాన్ని తీయాలి. ఆ తర్వాత,ఈ రసాన్ని కాటన్ తో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే వదిలేయాలి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
టమాటా రసం: టమాటా రసం కూడా సౌందర్యసాధనంగా పనిచేస్తుంది. ముఖం రంగును మెరుగుపరచడంలో టమాటా రసం మ్యాజిక్‌లా పనిచేస్తుంది. ఈ రసం పొడి చర్మం సమస్యను అధిగమించడానికి సహాయపడుతుంది. టమాటా రసం తయారు చేయడానికి ముందుగా టమాటాలను తురిమి దాని రసాన్ని తీయాలి. ఆ తరువాత ఈ రసాన్నివేళ్లు లేదా దూది సహాయంతో ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు ఉంచాలి. తరువాత, సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. టమోటాలలో ఉన్న విటమిన్ సి చర్మం మీద మంచి ప్రభావం చూపుతుంది.
ఇవి కూడా చదవండి
ముల్తానీ మిట్టి: ముల్తానీ మిట్టిని ఫేస్ ప్యాక్ తో ముఖం రంగును మెరుగుపరచుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మం మీద నలుపుదనాన్ని ఇట్టే తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ సెప్టిక్,యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉన్నాయి. ముల్తానీ మిట్టితో ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి ఒక గిన్నెలో 4 టీస్పూన్ల ముల్తానీ మట్టి,2 టీస్పూన్ల నిమ్మరసం, 4 టీస్పూన్ల పెరుగు, 1 టీస్పూన్ గ్లిజరిన్ వేసి పేస్టు తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కడిగేయాలి. ఆ తరువాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది వారానికి రెండు సార్లు చేయడం ద్వారా చర్మం మెరుస్తూ ఉంటుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..