లేటెస్ట్ టెక్నాలజీతో వస్తున్న 5జీ ఫోన్లకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉంది. వీటి ధరలు ఎక్కువగా ఉంటుందని ఉద్దేశంలో కొందరు 4జీ ఫోన్లను కొనుగోలు చేస్తున్నాయి. అయితే కేవలం రూ.15 వేల ధరలోనే ప్రముఖ బ్రాండ్లకు చెందిన 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ధరలు, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.
సామ్సంగ్ గెలాక్సీ ఎం35
సామ్సంగ్ గెలాక్సీ ఎం35ను తక్కువ బడ్జెట్ బెస్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. మన దేశంలో ఈ బ్రాండ్ కు ఎంతో ఆదరణ ఉంది. దీనిలో 6.6 అంగుళాల డిస్ ప్లే, ఓఐఎస్ తో కూడిన 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2 ఎంపీ మాక్రో కెమెరా, 13 ఎంపీ సెల్పీ కెమెరా ఏర్పాటు చేశారు. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 25 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ ను ఉపయోగించి బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. అయితే చార్జర్ ను విడిగా కొనుగోలు చేసుకోవాలి. ఈ ఫోన్ రూ.14,999కు అందుబాటులో ఉంది.
మోటోరోలా జీ64
మోటోరోలా జీ64 ఫోన్ లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అధిక బ్యాటరీ సామర్థ్యం, మెరుగైన కెమెరాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోన్ లో 6.5 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7025 చిప్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 33 డబ్ల్యూ ఫాస్ చార్జర్ ను ఉపయోగించి బ్యాటరీని చాలా వేగంగా చార్జింగ్ చేయవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు చక్కగా తీసుకోవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన మోటోరోలా జీ64 ఫోన్ రూ.13,999కు అందుబాటులో ఉంది.
ఇవి కూడా చదవండి
రియల్ మీ పీ1
రియల్ మీ పీ1 స్మార్ట్ ఫోన్ లోని 6.67 అంగుళాల డిస్ ప్లే ద్వారా విజువల్స్ చాలా స్పష్టంగా చూడవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దాదాపు ఒకటిన్నర రోజులు చార్జింగ్ ఇస్తుంది. 45 డబ్ల్యూ సూపర్ వూక్ చార్జర్ ను ఉపయోగించి అరగంటలో 50 శాతం బ్యాటరీని చార్జింగ్ చేసుకోవచ్చు. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, ముందు 16 ఎంపీ కెమెరా, మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ రూ.14,999కు అందుబాటులో ఉంది.
పోకో ఎం7 ప్రో
తక్కువ బడ్జెట్ లో లభించే మంచి ఫోన్లలో పోకో ఎం7ప్రో ఒకటి. దీనిలో 6.67 అంగుళాల డిస్ ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఐపీ64 రేటెడ్ ఇన్ గ్రెస్ ప్రొటెక్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం 8 మీమీ మందంతో ఆకట్టుకుంటోంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెన్సార్, 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాలతో ఫొటోలు, వీడియోలు చక్కగా తీసుకోవచ్చు. 45 డబ్ల్యూ ఫాస్ట్ చార్జర్ కు మద్దతు ఇచ్చే 5110 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్య ఉండదు. హైపర్ ఓఎస్ తో ఆండ్రాయిడ్ 14పై పనిచేసే ఈ ఫోన్ రూ.14,999కి అందుబాటులో ఉంది.
ఐక్యూ జెడ్9ఎక్స్
ఐక్యూ జెడ్9ఎక్స్ స్మార్ట్ ఫోన్ లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఏర్పాటు చేశారు. 44 డబ్ల్యూ ఫాస్ చార్జర్ తో వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. దీని మందం 8 మీమీ కంటే తక్కువగా ఉంటుంది. ఫన్ టచ్ ఓఎస్ తో ఆండ్రాయిడ్ 14పై ఆధారపడి పనిచేస్తుంది. 6.72 అంగుళాల డిస్ ప్లే, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, వెనుక వైపు 2 ఎంపీ డెప్త్ సెన్సార్, ముందు వైపు 8 ఎంపీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 చిప్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ రూ.13,499కు మార్కెట్ లో అందుబాటులో ఉంది. దీనిలోని 8 జీబీ ర్యామ్ వేరియంట్ ను రూ.15 వేలకు కొనుగోలు చేయవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి