Bigg Boss 8 Telugu: 3 వారాలే ఉన్నా భారీగానే.. బిగ్ బాస్ ద్వారా మెహబూబ్ ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?

2 hours ago 1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మరో వారం పూర్తయ్యింది. ఎనిమిదో వారంలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్ అయ్యాడు. చాలా మంది నయని పావని ఎలిమినేట్ అవుతుందని భావించినా నాగార్జున ఆమెను సేవ్ చేసి మెహబూబ్ ను బయటకు పంపించేశాడు. దీంతో ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల సంఖ్య తొమ్మిదికి చేరింది. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, నైనిక, ఆదిత్య ఓమ్, కిర్రాక్ సీత, నాగ మణికంఠ ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వెళ్లిపోగా తాజాగా మెహబూబ్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. అయితే ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన మొదటి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మెహబూబ్ నే కావడం గమనార్హం. 8వ వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్స్ లో ఉండగా.. మెహబూబ్, నయని పావనికి తక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఈ వారం నయని పావనిపూ ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు. బిగ్ బాస్ రివ్యూయర్లు కూడా పావనినే బయటకు వచ్చేస్తుందని చెప్పేశారు. అయితే అనూహ్యంగా నాగార్జున నయనిని సేవ్‌ చేసి, మెహబూబ్ దిల్ సే ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు. దీంతో నిరాశగా బయటకు వచ్చాడు మెహబూబ్.

ఇవి కూడా చదవండి

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెహబూబ్ మూడు వారాల పాటు హౌస్ లో కొనసాగాడు. అక్టోబర్ 6న బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన మెహబూబ్ దాదాపు 21 రోజలు హౌస్ లో ఉన్నాడు. ఈక్రమంలో అతను ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడో అన్నది ఆసక్తిగా మారింది. బిగ్ బాస్ తెలుగు 8 కోసం మెహబూబ్ దిల్ సే వారానికి రూ 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే, ఈ లెక్కన 3 వారాలకు మెహబూబ్ దిల్ సే రూ. 15 లక్షల రూపాయలు సంపాదించాడని సమాచారం. కాగా గతంలో బిగ్ బాస్ నాలుగో సీజన్ లోనూ కంటెస్టెంట్ గా వచ్చాడు మెహ బూబ్.

బిగ్ బాస్ బజ్ లో మెహబూబ్ దిల్ సే..

🌟 Don’t miss Mehaboob’s exclusive exit interview! Join Mehaboob and anchor Arjun for an engaging post-elimination chat packed with laughter, surprises, and heartfelt reflections connected his journey. Catch each the amusive and surprises lone connected #BiggBossTelugu8 #BiggBossBuzzz #StarMaaMusic pic.twitter.com/1WpBskmT3S

— Starmaa (@StarMaa) October 27, 2024

 అందరికీ ధన్యవాదలు: మెహబూబ్ ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article