Bigg Boss 8 Telugu: అభయ్.. నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం.. నాగార్జున వార్నింగ్.. వీడియో చూపించి మరీ..

1 hour ago 2

శనివారం ఎపిసోడ్‏లో అడియన్స్ ఊహించినట్లుగానే ఒక్కొక్కరికి ఇచ్చిపడేసాడు హోస్ట్ నాగార్జున..ముఖ్యంగా అభయ్‏కు చుక్కలు చూపించాడు. నిన్నటి ఎపిసోడ్ లో శుక్రవారం నాటి గేమ్స్ చూపించారు. ఇక అందులో మరోసారి బిగ్‎బాస్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు అభయ్. నేనైతే బిగ్‎బాస్ నే తిట్టిపడేస్తా కదరా.. నాలా ఉండాలి.. నేను ఎవరు ఏమనుకున్నా.. నేను చెప్పాల్సింది చెప్తా అన్నా.. అది నా క్యారెక్టర్.. ఈవారం నాకు అదే బ్యాడ్ అయ్యిందేమో అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత నాగార్జున కర్ర పట్టుకుని స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ముందుగా సోనియాను నిల్చోబెడుతూ.. బెలూన్ టాస్కులో సంచాలక్ గా నువ్వు కరెక్ట్ గానే చేశావా.. అని అడగ్గా.. కన్ఫ్యూజ్ అయ్యాను సర్ అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అభయ్ మాట్లాడుతూ. ఆమె సరిగ్గా చేయలేదు సార్.. నేను చెప్పినా ఎవరు వినలేదు.. బాక్స్ బయట వాటిని కౌంట్ చేయలేదు అని చెప్పడంతో వీడియో చూపించారు నాగ్. బాక్స్ బయట ఉంటే ఎందుకు కౌంట్ చేయాలి. నువ్వు బాక్స్ బయటకు వెళ్లి.. సోనియా నిఖిల్ కు ఫేవర్ చేసిందని ప్రపంచానికి చెప్పాలనుకున్నావ్ కదా అని అడిగారు నాగ్. నాదే మిస్టేక్ అంటూ తప్పు ఒప్పుకున్నాడు అభయ్.

ఇక తర్వాత అభయ్ ను నిల్చోబెట్టి కడిగిపాడేశాడు. బిగ్‎బాస్ డోర్స్ ఎందుకు తెరిచాడో తెలుసా..? అని నాగ్ అడగ్గా.. బిగ్‎బాస్ గేమ్స్ గురించి మాట్లాడాను కదా అందుకే అంటూ అభయ్ చెప్పడంతో.. నువ్వు గేమ్ రూల్స్ గురించి మాట్లాడావా.. ?? అంటూ మరోసారి అడిగారు నాగార్జున. దీంతో దీంతో ఏం మాట్లాడానో ఐడియా లేదు సర్.. అన్ని మిస్టేక్స్ నావైపు నుంచే ఉన్నాయని తప్పు ఒప్పుకున్నాడు. నువ్వు ఒకటి కాదు.. రెండు కాదు..నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేశావో తెలుసా..? అభయ్ నువ్వు పెద్ద సైకోలా ఉన్నావ్.. ఏం మాట్లాడావో చూడు అంటూ వీడియో చూపించారు నాగ్. ఇక అందులో నోటికి వచ్చినట్లు మాట్లాడాడు అభయ్. బిగ్‎బాస్ మనిషి పుట్టుకే పుట్టాడా ? ముగ్గురు వంట ఎలా చేస్తారు అంతమందికి.. బుర్రలేదా.. ఈడమ్మా సైకో.. బిగ్‎బాస్ కే క్లారిటీ లేదు… బిగ్‎బాస్ కాదు.. బయాస్డ్ బాస్.. నేను బయట ఇంటర్వ్యూలలోనూ అదే చెప్తా.. మెంటల్ గాడు..లిమిట్ లెస్ బయాస్డ్ బిగ్‎బాస్.. లఫంగి ఎడిట్ లు చేస్తున్నాడు. బిగ్‎బాస్ పెళ్లాం కొట్టినప్పుడల్లా టాస్క్ మార్చేస్తున్నాడు.. వాళ్లు రాసిన పేపర్ ముందొచ్చినట్లు ఉంది.. దాన్ని బట్టి ఆడిస్తున్నారు అంటూ ఇష్టంవచ్చినట్లు మాట్లాడాడు. అభయ్ వీడియో చూసి హౌస్మేట్స్, ఇటు అడియన్స్ కూడా షాకయ్యారు. దీంతో తలదించుకుని నిలబడ్డాడు అభయ్.

అభయ్.. నీ ఫేసే, నీ వాయిస్ నే.. అన్నీ లఫంగి మాటలే.. మనిషి పుట్టుక పుట్టావా..? సైకో గాడిలా ఉన్నావ్ చూడు.. అభయ్ ఇది బిగ్‎బాస్ హౌస్.. ఇక్క రూల్స్ మాత్రమే ఉంటాయి.. రెస్పెక్ట్ లేకపోవడం అనేది మేజర్ మిస్టేక్ అంటూ సీరియస్ అయ్యారు నాగ్. దీంతో మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించి తప్పైందని ఒప్పుకున్నాడు అభయ్. చేసిందంతా చేసేసి మళ్లీ ఇదేంటీ ? బిగ్‎బాస్ కు మెంటలా.. ఇక్కడ అతను ఎలా నడిపిస్తే అలాగే నడుస్తుంది.. ఆటపై కానీ.. బిగ్‎బాస్ పై రెస్పెక్ట్ లేకపోతే ఇక్కడ ఉండొద్దు.. ఇది మళ్లీ రిపీట్ కావడానికి వీళ్లేదు. అందుకే నీకు రెడ్ కార్డ్ ఇస్తున్న.. బిగ్‎బాస్ డోర్స్ ఓపెన్ చేయండి.. అభయ్ గెటౌట్.. బయటకు పో అని అన్నారు నాగ్. దీంతో ఒక్క ఛాన్స్ ఇవ్వండి సరా.. ప్లీజ్ సార్ అంటూ యష్మీ అనడంతో కూర్చో అంటూ సీరియస్ అయ్యారు నాగ్. సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మళ్లీ తప్పు చేయను.. ఇది నా లైఫ్ కూడా అవసరం.. ప్లీజ్ సార్.. మళ్లీ రిపీట్ కాదంటూ రిక్వెస్ట్ చేశాడు అభయ్. కానీ నాగార్జున రెడ్ కార్డ్ చూపిస్తూ నువ్వు క్యాన్సర్ కంటే ప్రమాదం.. నీలాంటి వ్యక్తి హౌస్ లో ఉండకూడదు.. అది అందరికి సోకుతుంది.. నువ్వు బయటకు వెళ్లు అంటూ నాగ్ అనడంతో హౌస్మేట్ అందరూ కలిసి మరో ఛాన్స్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్ చేయడంతో అభయ్ ను ఇంట్లో ఉండమన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article