ఈసారి బిగ్ బాస్ లోకి మొత్తం 20 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అందులో 19 మందిని కాదని వైల్డ కార్ట్ ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ హనుమంత బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్నాడు. కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత.. మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చాడు. తన సొంతూరులోనే డిగ్రీ వరకు చదివిన ఆయన సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లోనూ తన దైన ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ ను అలరించాడు. దీనికి తోడు ఆనకేరు హనుమంతరావుకు భారీగా ఓట్లు పడ్డాయి. మొత్తానికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ప్రజల అభిమానాన్ని చూరగొన్న హనుమంతుడికి అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా హనుమంతుడు చాలా కష్టాలు చూశాడు. అతను కొన్ని రియాల్టీ షోలలో కనిపించాడు. అయితే ఎక్కడా విజేతగా నిలవలేదు. కేవలం లుంగీ షర్ట్‌లో కనిపించిన అతను తన సింప్లిసిటీతో బిగ్ బాస్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు.
కాగా బిగ్ బాస్ కన్నడ విజేత హనుమంతకు రూ. 50 లక్షల ప్రైజ్‌మనీ తో పాటు ట్రోఫీ, లగ్జరీ కారు దక్కాయి. రన్నరప్‌గా నిలిచిన త్రివిక్రమ్‌కు రూ. 10 లక్షలు గెలుచుకున్నారు. హనుమంతుడు లుంగీ, చొక్కా ధరించి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు. అది కూడా వైల్డ్ కార్డ్ ద్వారా. ఇప్పుడు ఏకంగా కప్పును ఎగరేసుకుపోయాడీ రైతు బిడ్డ. కాగా ‘బిగ్ బాస్’ తర్వాత హనుమంత ‘గర్ల్స్ వర్సెస్ బాయ్స్’ షోకి ఎంపికయ్యారు. దీని షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి
హనుమంతును బిగ్ బాస్ విజేతగా ప్రకటిస్తోన్న అద్భుత క్షణాలు.. వీడియో
ಅತೀ ಹೆಚ್ಚು ವೋಟ್ಸ್ ಪಡೆದು ವಿಕ್ಟರಿ ಬಾರಿಸಿದ ಹನುಮಂತು!
ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa pic.twitter.com/a6YfYVNVWm
— Colors Kannada (@ColorsKannada) January 26, 2025
ఇక తెలుగు బిగ్‌బాస్ 8 విన్నర్‌గా నిలిచిన నిఖిల్ రూ. 55 లక్షల ప్రైజ్ మనీతో పాటు ఒక కారు కూడా గెలుచుకున్న విషయం తెలిసింది.
లుంగీతోనే చరిత్ర సృష్టించాడు..
ಬಿಗ್ ಬಾಸ್ ಸೀಸನ್ 11ರ ವಿನ್ನರ್ ಹನುಮಂತು 💐
ಬಿಗ್ ಬಾಸ್ ಕನ್ನಡ 11 ಗ್ರಾಂಡ್ ಫಿನಾಲೆ#BiggBossKannada11 #BBK11 #GrandFinale #HosaAdhyaya #ColorsKannada #BannaHosadaagideBandhaBigiyaagide #ಕಲರ್ಫುಲ್ಕತೆ #colorfulstory #Kicchasudeepa #BBKWatchNow pic.twitter.com/94vz2SVSnI
— Colors Kannada (@ColorsKannada) January 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.