Birsa Munda Jayanti: బిర్సా ముండా స్ఫూర్తితో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు.. ట్రైబల్ హెరిటేజ్‌ లక్ష్యంగా..

2 hours ago 1

గిరిజన నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని.. నవంబర్ 15న భారతదేశం జనజాతీయ గౌరవ్ దివస్‌ను జరుపుకుంటుంది. ఈ రోజున భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని గౌరవించడమే కాకుండా, గతంలో తరచుగా విస్మరించబడిన భారతదేశంలోని గిరిజన సంఘాల గొప్ప సాంస్కృతిక వారసత్వం, సహకారాన్ని ప్రతిబింభించేలా జనజాతీయ గౌరవ్ దివస్‌ ను మోదీ ప్రభుత్వం ఏటా ఘనంగా నిర్వహిస్తూ.. గిరిజనుల చైతన్యానికి కృషిచేస్తోంది..

భారతదేశంలోని గిరిజన వర్గాలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యక్తిగతంగా అనుబంధంతోపాటు.. అపారమైన గౌరవం ఉంది.. ఆయన గిరిజనుల ఇంటిలో టీ పంచుకున్నా, వారి పండుగలు జరుపుకుంటున్నా లేదా గర్వంగా వారి సంప్రదాయ దుస్తులను ధరించినా అతని చర్యలలో ఈ బంధం స్పష్టంగా కనిపిస్తుంది. మునుపటి విధానాలకు భిన్నంగా, గిరిజన వర్గాలతో ప్రధాని మోదీ ఎల్లప్పుడూ చేరువులో ఉండటం, ప్రోత్సహాకాలు అందించడం, గిరజన వర్గాల అభ్యున్నతికి పాటుపడటం అనేది వాస్తవమైనది.. గిరిజన నాయకులు, గిరిజనుల కథలు, కళలను తెరపైకి తీసుకురావడం.. జాతీయ, అంతర్జాతీయ దశలకు వారి సహకారాన్ని పెంచడం కోసం అహర్నిషలు కృషిచేస్తున్నారు. అనేక విధాలుగా, భారతదేశంలోని గిరిజన వర్గాలతో ఇంత సన్నిహిత, గౌరవప్రదమైన సంబంధాన్ని పెంపొందించిన మొదటి ప్రధానమంత్రి.. నరేంద్ర మోదీనే..

గత దశాబ్దంలో, గిరిజన సంస్కృతికి గుర్తింపుగా.. వేడుకలైనా, పథకాలైనా.. ఇంకా అనేక విషయాల్లో మార్పులను మనం గమనించవచ్చు.. జాతీయ – గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌లలోని గిరిజన వర్గాల వాణిని ప్రధాని మోదీ విస్తరించిన మార్గాలు అనేకం ఉన్నాయి.

ప్రపంచ నాయకులకు గిరిజన సంపదను బహుకరించడం

ప్రపంచ నాయకులకు గిరిజన కళాఖండాలను అందించడం ద్వారా ప్రధానమంత్రి మోడీ భారతదేశ గిరిజన సంస్కృతుల పట్ల ప్రపంచవ్యాప్త ప్రశంసలను పెంపొందించారు.. దీంతోపాటు.. దీంతోపాటు గుర్తింపును ప్రోత్సహిస్తున్నారు. ఈ బహుమతులలో.. డోక్రా కళ.. దాని క్లిష్టమైన లోహపు పనికి, లోతైన చారిత్రక మూలాలకు ప్రసిద్ధి చెందింది.. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కుక్ దీవులు.. టోంగా నాయకులకు దీనిని బహూకరించారు.. జార్ఖండ్‌కు చెందిన సొహ్రాయ్ పెయింటింగ్‌లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు, గోండ్ పెయింటింగ్‌ను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు.. మధ్యప్రదేశ్ నుంచి తీసుకెళ్లి బహుమతిగా అందించారు. ఉజ్బెకిస్తాన్ – కొమొరోస్ నుంచి వచ్చిన నాయకులు మహారాష్ట్రకు సంబంధించిన వార్లీ చిత్రాలతో సత్కరించారు.

GI ట్యాగ్‌లతో గిరిజన వారసత్వాన్ని ప్రచారం చేయడం

జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ల ద్వారా గిరిజన ఉత్పత్తుల గుర్తింపు ఊపందుకుంది.. 75కి పైగా గిరిజన ఉత్పత్తులు ఇప్పుడు అధికారికంగా ట్యాగ్ చేయబడ్డాయి. గిరిజన హస్తకళాకారులకు సాధికారత కల్పించే ఈ ప్రయత్నం సాంప్రదాయ హస్తకళలను గుర్తింపు పొందిన బ్రాండ్‌లుగా మార్చడం ద్వారా ప్రభుత్వం “వోకల్ ఫర్ లోకల్” చొరవతో సరిపెట్టుకుంది. 2024లో, అస్సాం నుంచి జాపి అనే వెదురు టోపీతో సహా అనేక వస్తువులు GI ట్యాగ్‌లను అందుకున్నాయి. ఒడిశా నుంచి డోంగ్రియా కోండ్ శాలువ; యాక్ చుర్పి, అరుణాచలి యాక్ పాలు నుంచి పులియబెట్టిన ఉత్పత్తి; సిమిలిపాల్ కై చట్నీ, ఒడిశాలోని ఎర్ర నేత చీమల నుంచి తయారు చేయబడింది; బోడో అరోనై, బోడో కమ్యూనిటీ నుండి సంప్రదాయ నేసిన వస్త్రం. అదనంగా, గిరిజన వర్గాల విభిన్న భాషలు, సంప్రదాయాలు, సాంస్కృతిక పద్ధతులను డాక్యుమెంట్ చేయడానికి, ఆర్కైవ్ చేయడానికి, ప్రోత్సహించడానికి 300 పైగా గిరిజన వారసత్వ సంరక్షణ కేంద్రాలు స్థాపించారు.

భగవాన్ బిర్సా ముండా వారసత్వాన్ని గౌరవించడం..

నవంబర్ 15ని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం ద్వారా భగవాన్ బిర్సా ముండాకు గౌరవం కల్పిస్తూనే.. ఆయన వారసత్వాన్ని ప్రధాని మోదీ కొనసాగిస్తున్నారు. జార్ఖండ్‌లోని ఉలిహటులో ఉన్న ముండా జన్మస్థలాన్ని సందర్శించిన మొదటి ప్రధానమంత్రిగా మారారు.. రాంచీలోని భగవాన్ బిర్సా ముండా మెమోరియల్ పార్క్, ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం, 25 అడుగుల ముండా విగ్రహం, ఇతర గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను గౌరవించడం ఈ గుర్తింపును నొక్కి చెబుతుంది. అతని 150వ జయంతిని పురస్కరించుకుని, శ్రీ విజయ పురంలోని వనవాసి కళ్యాణ్ ఆశ్రమంలో ముండా గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు.. దాని చివరి స్థాపనకు ముందు ప్రతిమను వివిధ ప్రాంతాల మీదుగా “గౌరవ యాత్ర”గా తీసుకువెళ్లనున్నారు.

గిరిజన వారసత్వం కోసం ఒక పెద్ద వేదిక – ఆది మహోత్సవం

2017లో ప్రారంభమైనప్పటి నుండి, ఆది మహోత్సవ్ భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజన వ్యవస్థాపకత, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించింది. ఇప్పటి వరకు 37 ఎడిషన్‌లు జరిగాయి. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌మెంట్ ఫెడరేషన్ (TRIFED) ద్వారా నిర్వహించబడిన ఈ ఉత్సవంలో 1,000 మంది గిరిజన కళాకారులు పాల్గొంటారు. 300 స్టాల్స్‌లో అనేక రకాల గిరిజన కళలు, కళాఖండాలు, హస్తకళలు, వంటకాలను ప్రదర్శిస్తారు. G20 సమ్మిట్‌లో, గిరిజన కళాకారులు తమ పనికి అంతర్జాతీయంగా మరింత గుర్తింపు పొందారు.

గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం

బిర్సా ముండా, రాణి కమలాపతి, గోండ్ మహారాణి వీర్ దుర్గావతి వంటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధులను మోదీ ప్రభుత్వం సత్కరించింది. భారతదేశ చరిత్రను రూపొందించిన ఖాసీ-గారో, మిజో, కోల్ తిరుగుబాట్లు వంటి ఉద్యమాలు కూడా గుర్తింపు లభించింది. హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్‌కు భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా, కైమాయి రైల్వే స్టేషన్‌కు మణిపూర్‌లోని రాణి గైడిన్లియు స్టేషన్‌గా పేరు మార్చారు. అదనంగా, భారతదేశం అంతటా స్వాతంత్ర్య సమరయోధుల ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. వాటిలో మూడు ఇప్పటికే పూర్తయ్యాయి: రాంచీలోని భగవాన్ బిర్సా ముండా ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం, జబల్‌పూర్‌లోని రాజా శంకర్ షా రఘునాథ్ షా మ్యూజియం, చింద్వారాలోని బాదల్ భోయ్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియం..

గిరిజన ఎగుమతులను విస్తరించడం..

భారతదేశపు గిరిజన ఉత్పత్తులు అంతర్జాతీయంగా ఆదరణ పొందుతున్నాయి. అరకు కాఫీ.. 2017లో పారిస్‌లో తన మొదటి ఆర్గానిక్ కాఫీ షాప్‌ను ప్రారంభించింది, ఇది ప్రపంచ మార్కెట్‌లలోకి ప్రవేశించింది. అదేవిధంగా, ఛత్తీస్‌గఢ్‌లోని డీహైడ్రేటెడ్ మోహువా పువ్వులు ఫ్రాన్స్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్‌లలోకి ప్రవేశించాయి. శాలువాలు, పెయింటింగ్‌లు, చెక్క వస్తువులు, ఆభరణాలు, బుట్టలు వంటి గిరిజన ఉత్పత్తులు ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. TRIFED అవుట్‌లెట్‌లు, జాతీయ, అంతర్జాతీయ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వం ఈ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది.

TRIFED ద్వారా గిరిజన జీవనోపాధిని బలోపేతం చేయడం

నవంబర్ 2024 నాటికి, TRIFED తన రిటైల్ నెట్‌వర్క్ అయిన ట్రైబ్స్ ఇండియా ద్వారా 100,000 కంటే ఎక్కువ గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను సులభతరం చేస్తూ 218,500 కళాకారుల కుటుంబాలకు అధికారం ఇచ్చింది. ఈ చొరవ కళాకారులను విస్తృత మార్కెట్‌లతో అనుసంధానం చేయడం, వారి ప్రత్యేక హస్తకళలను ప్రోత్సహించడం, స్థిరమైన ఆదాయ వనరులను నిర్ధారించడం ద్వారా జీవనోపాధిని మెరుగుపరుస్తుంది.

భారతదేశంలోని గిరిజన వర్గాల పట్ల PM మోడీ నిబద్ధత, వారి వారసత్వాన్ని కొనసాగించడానికి.. వారి సంప్రదాయాలను కాపాడటానికి, జాతీయ స్థాయిలో వారి సహకారాన్ని ఏకీకృతం చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమాలు గిరిజన సంఘాల లోతైన సాంస్కృతిక మూలాలను గౌరవిస్తాయి.. వారికి సాధికారత కల్పిస్తాయి.. వారి గొంతులను, కథలను ప్రపంచానికి తెలియజేస్తాయి..

స్మారక నాణెం, తపాలా స్టాంపును ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ..

కాగా.. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ రూ.6,640 కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇవ్వనున్నారు. ట్రైబల్ ప్రైడ్ డే సందర్భంగా నవంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌లో పర్యటించనున్నారు. ఈ సమయంలో, ప్రధాని మోదీ రూ. 6640 కోట్ల కంటే ఎక్కువ ఖర్చుతో కూడిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేస్తారు. జమూయిలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. ఉదయం 11 గంటలకు లార్డ్ బిర్సా ముండా గౌరవార్థంగా స్మారక నాణెం, తపాలా స్టాంపును ప్రధాని ఆవిష్కరిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article