ఈ రోజు బ్రహ్ముముడి ఎపిసోడ్‌లో.. రాజ్ ఇంటికి డల్‌గా కావాలనే నడుచుకుంటూ వస్తాడు. రాజ్ వాలకం చూసి.. ఓడిపోయాడనుకుంటారు. రాజ్ రాగానే కోడలు ఏది అని అందరూ అడుగుతారు. కళావతి కోసం ఆటోనే బుక్ చేశానని రాజ్ అంటాడు. ఎందుకు రా నీకు అంత ఇగో కలిసి తీసుకు రావచ్చుగా అని ఇందిరా దేవి అంటే.. బుక్ చేసి పుట్టింటికి పంపించేశా అని రాజ్ అంటే.. ఎందుకు తన లగేజ్ తీసుకురమ్మన్నావా అని అపర్ణ అడుగుతుంది. ఏంటి నీకు ఇంకా అర్థం కాలేదా? నేనే గెలిచానని రాజ్ అంటే.. రుద్రాణి, రాహుల్ కూడా ఆనంద పడతారు. మంచి సాంగ్ పెట్టు డ్యాన్స్ చేద్దామని రాజ్ అంటే.. రుద్రాణి సాంగ్ పెట్టి.. డ్యాన్స్ చేస్తుంది. రాజ్‌ని చూసి మిగతావారు అందరూ బాధ పడతారు. డైజెస్ట్ కావడం లేదా.. ఎన్ని మాటలు అన్నారు మమ్మీ.. నేను ఓడిపోవాలని ఎంతగా కోరుకున్నారు? మీలాంటి వ్యతిరేక ప్రతికూల శక్తుల్ని ఎదుర్కొని.. పోటీలో నేనే గెలిచి.. కళావతిని పుట్టింటిచి పంపించేశా.
ఇది కూడా ఒక గెలుపేనా సీతారామయ్య తిట్లు..
ఆఫీస్ టైమ్ కాకముందే ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా.. మీ అందరి ముఖ చిత్రాలు చూడాలని రాజ్ అంటాడు. కొడుకు ఓడిపోవాలని కోరుకున్న మొదటి మదర్ గారు ఇప్పుడు ఏం అంటారు? నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసని రుద్రాణి అంటుంది. శాంతా వంటలన్నీ సిద్ధం చేశావా.. అని అడుగుతాడు రాజ్.. చేశారు బాబూ కావ్య అమ్మ వస్తుందేమోనని చేశాను.. నాకు ఏ మాత్రం సంతోషం లేదని శాంతా అంటుంది. ఇక అప్పుడే సీతారామయ్య వచ్చి.. ఏంట్రా ఇది కూడా ఒక గెలుపేనా.. నువ్వు నా మనవడివి అని చెప్పుకోవడానికి సిగ్గు పడుతున్నానని అంటాడు. నాన్నా ఏమైందని సుభాష్ అడిగితే.. వాడినే అడుగురా.. వాడే చెబుతాడు. వీడు కావ్యని మోసం చేసి గెలిచాడు. కావ్య వేసిన డిజైన్స్ వీడు దొంగతనంగా కొట్టేసి.. మోసం చేసి పందెంలో గెలిచాడని పెద్దాయన అంటాడు. ఓహో ఆ కళావతి డిజైన్స్ నేను కొట్టేశానని చెప్పి మీతో సానుభూతి సంపాదించుకోవాలనుకుందా? అని రాజ్ అంటాడు.
నీకూ రాహుల్‌కి తేడా లేదు..
ఛీ నోర్ముయ్.. నేను కంపెనీకి ఛైర్మన్‌ని రా.. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదా? కావ్యకు అలాంటి మనస్తత్వం లేదని సీతారామయ్య అంటాడు. మీరే కదా మోసం చేసి అయినా గెలవాలని అదే కళావతి విషయంలో కూడా చేశాను. అది తప్పు ఎలా అవుతుంది? అని రాజ్ అడుగుతాడు. రేయ్ ఇంకా నిన్ను నువ్వు సమర్దించుకోకు. బుద్ధి లేకుండా ఆత్మ వంచన చేసుకోకు. నిన్ను కావ్య ఏం మోసం చేసిందిరా? నిజాయితీగా పోటీకి సిద్ధ పడింది. ఎంతో కష్ట పడి ఆ డిజైన్స్ వేసింది. ఇంత చేసినా నిన్ను తప్పు పట్టకుండా నిన్ను గెలిపించి మౌనంగా వెళ్లిపోయిందని సీతారామయ్య అంటాడు. ఛీ నువ్వు ఇంత మూర్ఖంగా తయారయ్యావా? అని పెద్దావిడ, నీకూ రాహుల్‌కి ఎలాంటి తేడా కనిపించడం లేదని స్వప్న అంటుంది. దీంతో రాజ్ సీరియస్ అవుతాడు.
ఇవి కూడా చదవండి
కావ్యకి విడాకులే ఇస్తాను..
ఏ స్వప్న అన్న దానిలో తప్పు ఏం ఉంది? నా కొడుకు ఉన్నత భావాలు ఉన్నవాడు అనుకున్నా.. కానీ ఇలా కట్టుకున్న భార్యనే మోసం చేస్తాడని అనుకోలేదు. ఏం మనిషివిరా నువ్వు అని అపర్ణ తిడుతుంది. కావ్య డిజైన్సే వాళ్లకు నచ్చాయి కాబట్టి.. కావ్యని వెళ్లి తీసుకురమ్మని ఇందిరా దేవి అంటుంది. కళావతిని సమర్థించే అందరికీ చెబుతున్నా.. నేను ఓడిపోయానని.. ఆ సీట్లో కూర్చొవడానికి అర్హత లేదని ఆఫీసులో అందరి ముందు బయట పెట్టినా సరే.. నేను కళావతిని ఈ ఇంటికి తీసుకురాను. కావాలంటే విడాకులు అయినా ఇచ్చేస్తానని రాజ్ అంటాడు. అది విన్న ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. మరోవైపు కావ్య భోజనం చేస్తూ ఉంటుంది. కనకం దగ్గరకు వచ్చి నాకేం నచ్చలేదని అంటుంది. నాకు నచ్చిందే.. ఇంకేం కావాలి అని కావ్య అంటుంది.
ప్రయత్నాలు ఆపేయమన్న కావ్య..
నాకు నీ పద్దతి నచ్చలేదు.. ఇంత తేలిగ్గా ఎలా తీసుకుంటున్నావ్? తప్పేం ఉంది అమ్మా.. జీవితం అంటే అప్పడం లాంటిదేనని కావ్య అంటుంది. అత్తారింటికి వెళ్లాలన్న ఆశ లేదా నీకు అని కనకం అడిగితే.. జరిగింది ఏదో జరిగిపోయింది.. ఇచ్చిన మాట ప్రకారం వచ్చేశాను. నీకు అడ్డం అయితే చెప్పు.. ఏదన్నా హాస్టల్‌కు వెళ్తానని కావ్య అంటుంది. నాకు నువ్వు నిజం చెప్పు.. నువ్వు ఓడిపోయావంటే నేను నమ్మను. అక్కడ ఏదో జరిగిందని కనకం అడిగితే.. అప్పుడే సీతారామయ్య ఫోన్ చేస్తాడు. ఎందుకు రిజైన్ చేసి వెళ్లావ్? అని అడిగితే.. ఓడిపోయిన వాళ్లు అన్నింటికి దూరంగా ఉండాలని మన కండీషన్ కదా అని కావ్య అంటే.. కాదమ్మా రాజ్ ఎలా గెలిచాడో.. నువ్వు ఎలా ఓడిపోయావో తెలుసు.. అది నేను ఒప్పుకోను. వాడు చేసిన తప్పు వాడికి తెలిసేలా చేస్తానని సీతారామయ్య అంటే.. తాతయ్య గారు నా మీద ఉన్న మంచి అభిప్రాయంతో ఈ టైమ్‌లో ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.. ఆనందంగానే ఉంది. కానీ ఆయనకు నా మీద కొంచెం అంటే కొద్దిగా కూడా ప్రేమ లేదు. నేను ఆయన భార్య అన్న ఆలోచన లేదు. అందుకే ఎలా అయినా నా మీద గెలవాలి అనుకున్నారని కావ్య అంటుంది. సీతారామయ్య మళ్లీ సిఈవో చేస్తానని అన్నా.. కావ్య ఒప్పుకోదు. నేను శాశ్వతంగా తప్పుకోవాలని తెలిసి కూడా ఇలా చేశారంటే.. నేను అక్కర్లేదనే కదా అర్థం. ఈ వృథా ప్రయత్నాలు ఆపేయండి. నేను అలిసిపోయాను నా వల్ల కాదు నన్ను క్షమించమని కావ్య అంటుంది.
అపర్ణ మాస్టర్ ప్లాన్..
ఇక అదంతా విన్న కనకం చాలా బాధ పడుతుంది. మరోవైపు ఇందిరా దేవి, అపర్ణ, సుభాష్‌లు కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు. వీడెందుకు ఇలా తయారయ్యాడు? విడాకులు అయినా ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు కానీ కావ్యని తీసుకు రావడానికి ఒప్పుకోవడం లేదని అనుకుంటారు. పోనీ నువ్వు నాన్నకి చెప్పమని సుభాష్ అంటే.. ఆ ప్రయత్నం కూడా అయ్యింది. నేను అలిసిపోయాను.. ప్రయత్నాలు ఆపేయమని అందట అని ఇందిరా దేవి అంటే.. కావ్య బాధలో కూడా నిజం ఉందని అపర్ణ అంటుంది. అప్పుడే కనకం ఫోన్ చేస్తుంది. తన బాధను చెప్పి బాధ పడుతుంది. వాళ్లిద్దర్నీ కలిపే బాధ్యత నాది.. అంటూ అపర్ణ.. కనకానికి మాట ఇస్తుంది. ఈ క్రమంలోనే ఓ నిర్ణయానికి వస్తుంది అపర్ణ. మరోవైపు సీతారామయ్యకు ఈ విషయం ఎలా తెలిసిందని.. ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అంతరాత్మ వచ్చి.. తిడుతుంది. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్‌లో కనకం ఇంటికి వెళ్తుంది అపర్ణ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..