ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. మీ మాట కాదనలేక నేను సిఈవో స్థానంలో కూర్చున్నాను. బోనస్‌లు ఇవ్వడానికి నాకు అర్హత లేదు. ఇంట్లో ఇంత మంది పెద్దవాళ్లు ఉన్నారు కదా.. పెద్దల చేత ఇప్పించాలని కావ్య అంటుంది. ఆఫీస్‌లో అర్హత స్థాయిని బట్టి ఉంటుంది. కానీ ఇంట్లో ఈ కోడలు అనే అర్హత చాలని సీతారామయ్య అంటాడు. అదెలా నాన్నా? రాజ్.. కావ్యని భార్యగానే అంగీకరించ లేనప్పుడు ఈ ఇంటి కోడలి స్థానం ఎలా ఇస్తాం? ఏదో వేలం పాటలో ఆ అమాయకురాలు అనామికను ఓడించినంత మాత్రాన ఏదో సాధించేసినట్టు అందలం ఎక్కిస్తున్నారేంటి? రాజ్ కష్ట పడి కంపెనీని ఓ స్థాయిలో నిలబెట్టాడు. ఏదైనా అర్హత ఉంది అంటే రాజ్‌కే అని రుద్రాణి అంటే.. అందుకు ధాన్యలక్ష్మి కూడా సై అంటుంది. కావ్యకు ఇవ్వడానికి అర్హత ఏముందని? అడుగుతుంది. నేను కోడలిగా అడుగు పెట్టినప్పుడు.. నువ్వు కోడలిగా అడుగు పెట్టినప్పుడు.. దీపావళికి బోనస్‌లు ఇప్పించారు కదా.. అప్పుడు అర్హత లేదని ఎవరూ అనలేదు. ఇప్పుడు నా కోడలి దాకా వచ్చేసరికి.. మీరెవరు ఆపడానికి? అని అపర్ణ నిలదీస్తుంది.
రాజ్‌కు బోనస్ ఇచ్చిన కావ్య..
రుద్రాణి, ధాన్యలక్ష్మి బోనస్‌లు అందించడం సిఈవో బాధ్యత. అది నిర్ణయించేది చైర్మన్ తీసుకున్న నిర్ణయం అని ఇందిరా దేవి అంటుంది. ఆ తర్వాత రాజ్ మాట్లాడుతూ.. కంపెనీ ఎంప్లాయిస్‌కి బోనస్‌లు ఇవ్వడం మన బాధ్యత. ఎవరి చేతితో ఇచ్చారు అనేదాని కన్నా ఎంప్లాయిస్ ఆనందం ముఖ్యమని అంటాడు. ఇక కావ్య ఉద్యోగులకు బోనస్‌లు ఇస్తుంది. చివరకి రాజ్ పేరు మీద కూడా బోనస్ రాసి ఉంటుంది. అది చూసి కావ్య షాక్ అవుతుంది. అది ఎవరిదో వెళ్లి ఇవ్వమని ఇందిరా దేవి అంటుంది. దీంతో కావ్య డౌట్‌గ తీసుకెళ్లి రాజ్ చేతికి ఇస్తుంది. ఏంటి నాకు బోనస్ ఇస్తారా? ఎవరికి ఉంది ఆ ధైర్యం అని రాజ్ అరుస్తాడు. ఇక కోపంతో రాజ్ బోనస్ తీసుకుంటాడు. అప్పుడే రుద్రాణి పుల్లలు పెడుతుంది. అవును నిజమే కంపెనీ సిఈవో కూడా ఎంప్లాయ్ కిందే కదా లెక్క. అని తన పేరు కొట్టేసి కావ్యకి ఇస్తాడు రాజ్. ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉంటారు. అది తట్టుకోలేక వెంటనే అనామికకు ఫోన్ చేస్తుంది రుద్రాణి. ఏది ఆ బాంబ్ ఇంకా పేలలేదు ఏంటి? ఎప్పుడో చెప్పు.. వాళ్ల ఆనందం చూడలేక పోతున్నానని రుద్రాణి అంటుంది. ఆ బాంబ్ ఎప్పుడు పేల్చాలో నాకు బాగా తెలుసు. కొద్దిగా ఓపిక పట్టమని అనామిక అంటుంది.
పాపం రాజ్.. ఆడేసుకుంటున్నారుగా..
ఆ తర్వాత కావ్య దగ్గరకు వచ్చి తినడం అయ్యిందా అని రాజ్ అంటే.. చేతులు కూడా కడుకున్నానని కావ్య అంటుంది. అయితే మరి ఇంకెందుకు వెళ్లు. అసలు నీకు ఇచ్చిన పదవి ఏంటో తెలుసా అని రాజ్ అడుగుతాడు. ఈ ఇంటి కోడలు అని కావ్య అంటే.. ఆ పదవి నుంచి తీసేశారు కదా.. అందుకే నన్ను తాతయ్య సిఈవో పోస్ట్ ఇచ్చారని కావ్య అంటుంది. అదే అలా సిఈవో అయి ఉండి.. ఎవరు పిలిస్తే వాళ్ల ఇంటికి వెళ్లి ఇలా భోజనం చేయరు. చాలా బిజీగా ఉంటారు. శునకాన్ని తీసుకొచ్చి కనకం సింహాసనం మీద కూర్చొన్నా బుద్ధి మారదంట నీలాగ.. అంటూ సిఈవో పోస్ట్ గురించి చెప్తాడు రాజ్. అయితే అక్కడి నుంచి కావ్య వెళ్లిపోతుంది. రాజ్ వెళ్లి వెతుకుతూ ఉంటాడు. ఎవరి కోసం అని ఇందిరా దేవి అడిగితే.. కా అని చెప్తాడు రాజ్. ఈ తర్వాత అపర్ణ, ఇందిరా దేవిలు గడ్డి పెడతారు. వెనుక నుంచి కావ్య చేయి వేస్తే.. అది చూసి రాజ్ పడబోతుండగా పట్టుకుంటాడు రాజ్. అప్పుడే ఒక రొమాంటిక్ సాంగ్ ప్లే అవుతుంది. ఏంటి నా కోసమే వెతుకుతున్నారా? అని కావ్య అడిగితే.. వెళ్లిపోయావుగా ఎందుకు వచ్చావు? అని రాజ్ అడిగితే.. మీరేమన్నా పిలిచారా.. మీకు చెప్పడానికి అమ్మమ్మ, తాతయ్యలకు చెప్పే వెళ్తానని కావ్య అంటుంది. దయచేయమని రాజ్ అంటాడు.
ఇవి కూడా చదవండి
కావ్యని వెళ్లిపొమ్మన్న రాజ్..
ఇక కావ్య వెళ్తానని అమ్మమ్మ, తాతయ్యలకు చెబుతుంది. అప్పుడేనా అని ఇందిరా దేవి అంటే.. రాహు కాలం వచ్చేస్తుంది వెళ్లు వెళ్లు అని రాజ్ అంటాడు. నేను ఇంకా ఇక్కడే ఉంటే మీ మనవడే గెంటేసేలా ఉన్నాడని కావ్య అంటుంది. ఎవడు ఈ మేనేజర్ గాడా.. సిఈవోనే గెంటేసే గొప్పోడు అయ్యాడా? ఎక్కువ చేస్తే ఆ మేనజర్ గిరి కూడా పీకేసి తోటమాలి పని చేయిస్తానని సీతారామయ్య అంటాడు. సెక్యూరిటీ కూడా సరిగా పని చేయడం లేదు. వాడిని కూడా మార్చాలి అనుకుంటున్నామని అపర్ణ అంటుంది. దీంతో దండం పెడతాడు రాజ్. ఆ తర్వాత ముగ్గురు కోడళ్లకు గిఫ్టులు ఇస్తుంది ఇందిరా దేవి. ఇందులో హారాలు ఉన్నాయి. అవి మీ భార్యలకు వేయమని అంటుంది. నేను వేయనని రాజ్ అంటాడు. ఎక్కువ చేయకుండా చెప్పింది చేయమని ఇందిరా దేవి అంటుంది. ఇంట్లోంచి వెళ్లిపోయిన వాళ్లు ఇంటి సభ్యులే కాదని రాజ్ అంటే.. ఏవండీ ఇటు రమ్మని బయటకు తీసుకెళ్తుంది కావ్య. రాజ్ బొద్దింకకు భయపడిన వీడియో చూపించి బెదిరిస్తుంది. ఇక చచ్చినట్టు ఒప్పుకుంటాడు రాజ్. ఇక ఇక్కడితో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..