ఇవాళ ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్‌లో రైతులు, పేదలు, మహిళలు, యువతపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి బడ్జెట్‌లో పలు రంగాల పన్నులు తగ్గించాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. గ్రామీణ పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు హోసింగ్ ఫర్ ఆల్ పేరుతో స్కీం ప్రవేశపెట్టే అవకాశం ఉందట. ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్‌ను.. రూ.10లక్షల వరకు పన్ను మినహాయింపు కోరుతున్నారు వేతనజీవులు.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌పై ఏపీ, తెలంగాణ భారీ ఆశలే పెట్టుకున్నాయి. కేంద్రం నుంచి లక్షన్నర కోట్లకు పైగా తెలంగాణ ఆశిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్‌కి సుమారు 35వేలకోట్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. మూసీ ప్రక్షాళనకు రూ.14వేలకోట్లు, మెట్రో ఫేజ్-2కి రూ.24వేలకోట్లు.. మిగతా స్కీమ్స్‌కి కూడా పెద్దఎత్తున నిధులు తెలంగాణ కోరుతోంది. అటు పోలవరం, అమరావతి అభివృద్ధికి మరిన్ని నిధులు ఏపీ కావాలంటోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.