వేతనజీవులూ.. మీకోసమే ఈ వార్త. కేంద్ర బడ్జెట్ అనగానే, మనకేమీ ఉండదని రొటీన్‌గా అనుకోకండి. ఏమో గుర్రం ఎగరావచ్చు అనుకోండి. ఎందుకంటే, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ధమాకా న్యూస్ రెడీ చేస్తున్నారు. బడ్జెట్‌కు ముందే హల్వా టేస్ట్.. మనం కూడా చూడొచ్చని ఢిల్లీ నుంచి కథనాలు గుప్పుమంటున్నాయి. బడ్జెట్ ధమాకాపై బ్రేకింగ్స్‌ను చూద్దాం..
Union Budget 2025
ఫిబ్రవరి ఒకటోతేదీన కేంద్ర బడ్జెట్‌లో వేతన జీవులకు గుడ్‌న్యూస్ వస్తుందా? ఇప్పుడే ఢిల్లీ నుంచి మన గల్లీదాకా ఇదే ఇంట్రస్టింగ్ న్యూస్. మధ్యతరగతిపై ధరలభారాన్ని తగ్గించి, వినిమయాన్ని పెంచేందుకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కసరత్తు చేస్తున్నారు. ఏడాది మీ వేతన సంపాదన 10 లక్షల వరకు ఉంటే మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ పరిధిలోకి రాకపోవచ్చు. అదే సందర్భంలో వార్షికాదాయం 15 నుంచి 20 లక్షల రూపాయలు ఉన్నవారికి 25 శాతం ట్యాక్స్ విధించే యోచన కూడా చేస్తున్నారు.
ఈ రెండు నిర్ణయాలను బడ్జెట్‌లో ప్రకటిస్తే, సర్కారీ ఖజానాపై 50వేల కోట్ల నుంచి నుంచి లక్ష కోట్ల రూపాయల భారం పడుతుందని లెక్కలు కూడా తీశారు. మొత్తానికి కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతారకైతే ఏడాదికి ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారు. ఈ పరిమితిని 10 లక్షల రూపాయల పెంచే సాధ్యాసాధ్యాలను లెక్కలమంత్రి అన్వేషిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రవేశపెట్టే బడ్జెట్లలో మధ్యతరగతికి ఇన్‌కమ్‌ట్యాక్స్ విషయంలో పెద్దగా గుడ్‌న్యూస్‌లు ఉండవు. కానీ దేశంలో ప్రస్తుతం ధరలు పెరుగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు ఆదాయం కూడా పెద్దగా పెరగడం లేదు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు, మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తులు చేస్తున్నట్లు గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అయితే ఫిబ్రవరి ఒకటి విడుదల ఎలా ఉంటుందన్నది ఇప్పుడు అసలు పాయింట్.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి