కొత్తిమీరలో యాంటీఆక్సిడెంట్స్, ఐరన్, ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, పైబర్, విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గిస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్ , ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , విటమిన్ ఎ, సి మన రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
కొత్తిమీరలో ఉండే విటమిన్ ఎ మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీనిలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలకు పోషణను అందిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలతో నిండి ఉంటాయి. దాని రసం మన చర్మ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..