మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఈ వార్త మీ కోసమే. డిసెంబర్ 1 నుండి క్రెడిట్ కార్డ్ నియమాలు మారబోతున్నాయి. బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్స్ ప్రయోజనాలకు రెండు ప్రధాన మార్పులు చేసింది. వీటిలో రివార్డ్ పాయింట్లు, రిడెంప్షన్, లాంజ్ యాక్సెస్‌కి సంబంధించిన నియమాలలో మార్పులు ఉన్నాయి.
రివార్డ్ పాయింట్లు:
డిసెంబర్ 1 నుంచి విమానాలు, హోటళ్ల కోసం రీడీమ్ చేయగల రివార్డ్ పాయింట్‌ల సంఖ్యపై బ్యాంక్ పరిమితులను విధిస్తుంది. కార్డ్ హోల్డర్‌లు మొత్తం బిల్లులో 70 శాతం లేదా గరిష్ట నెలవారీ పరిమితి (ఏది తక్కువైతే అది) కవర్ చేయడానికి తమ రివార్డ్ పాయింట్‌లను ఉపయోగించవచ్చు.
ఇవి కూడా చదవండి
నెలవారీ పరిమితులు
- ప్రైవేట్ ప్రైమ్ కార్డ్‌లు: 6,00,000 పాయింట్లు
- మార్క్యూ కార్డ్: 3,000 పాయింట్లు
- రిజర్వ్ కార్డ్: 2,000 పాయింట్లు
- యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు: 1,00,000 పాయింట్లు
ఇది కూడా చదవండి: School Holidays: వారం రోజుల పాటు పాఠశాలలు బంద్.. కీలక నిర్ణయం తీసుకోనున్న ఆ ప్రభుత్వం!
రిడీమ్‌పై ఈ పరిమితి ఇప్పటికే ఉన్న పరిమితికి అదనంగా ఉంటుంది. ఇది గిఫ్ట్ వోచర్‌లు, స్టేట్‌మెంట్ క్రెడిట్ కోసం అందుబాటులో ఉన్న పాయింట్‌లలో 50% మాత్రమే ఉపయోగించడానికి కార్డ్ హోల్డర్‌లను అనుమతిస్తుంది.
లాంజ్ యాక్సెస్:
యస్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్‌లపై కాంప్లిమెంటరీ ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం ఖర్చు పరిమితులను కూడా పెంచుతోంది. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి. యెస్ మార్క్యూ కింద 6, యెస్ రిజర్వ్ కార్డ్ కింద 3 లాంజ్ విజిట్ కోసం రూ. 1 లక్ష వరకు లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. మొదటి బిజినెస్ కార్డ్‌ల క్రింద 2 లాంజ్ విజిట్‌కు రూ. 75,000. యస్ బ్యాంకు ఎలైట్+, సెలెక్ట్, BYOC, వెల్‌నెస్ ప్లస్, యస్ ప్రోస్పెరిటీ బిజినెస్ కార్డులకు 1 లేదా 2 లాంజ్ విజిట్ కోసం రూ. 50,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Mukesh Ambani: ముఖేష్ అంబానీ ఎలాంటి ఆహారం తీసుకుంటారో తెలుసా..? వెల్లడించిన నీతా అంబానీ!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి