నేడు అనేక సందర్భాల్లో క్రెడిట్ స్కోర్, క్రెడిట్ రిపోర్టు అనే మాటలు వింటున్నాం. ఈ రెండు జీవితంలో అత్యంత కీలకంగా మారాయి. ఇవి ఒకటి కానప్పటికీ, ఒకదానిపై మరొకటి ఆధార పడి ఉంటాయి. క్రెడిట్ రిపోర్టు బాగుంటేనే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. తద్వారా రుణాలు తొందరంగా మంజూరవుతాయి. అలాగే తక్కువ వడ్డీకి పొందే అవకాశం ఉంటుంది. క్రెడిట్ స్కోర్ అనేది 300 నుంచి 900 మధ్య ఉండే మూడు అంకెల సంఖ్య. ఇది మీ ఆర్థిక క్రమశిక్షణను సూచిస్తుంది. గతంలో మీరు నిర్వహించిన ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా స్కోర్ పెరుగుతుంది. బిల్లులు, రుణ వాయిదాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపులు, ఇతర ఆర్థిక వ్యవహారాలు నిర్వహించిన తీరుకు అద్ధం పడుతుంది. ఈ స్కోర్ ను ఆధారంగా చేసుకునే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. క్రెడిట్ స్కోర్ 750 కన్నా ఎక్కువ ఉంటే మీరు ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా భావిస్తాయి. దాని ద్వారా తక్కువ వడ్డీకి, తక్కువ సమయంలో రుణాలు మంజూరు చేస్తాయి.
క్రెడిట్ రిపోర్టు (నివేదిక) అంటే మీ ఆర్థిక ప్రవర్తనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలిపే రిపోర్టు. దీని ఆధారంగా చేసుకుని క్రెడిట్ స్కోరును లెక్కిస్తారు. దీన్ని సిబిల్, ఎక్స్పీనియన్, ఈక్విఫ్యాక్స్, గ్రిఫ్ హైమార్క్ వంటి క్రెడిట్ బ్యూరోలు తయారు చేస్తాయి. దీనిలో మీ పేరు, పాన్ నంబర్, ఆధార్ వివరాలు, పుట్టిన రోజు తేదీ తదితర వ్యక్తిగత సమాచారంతో పాటు మీ క్రెడిట్ కార్డులు, రుణాలు, రీపేమెంట్ చరిత్ర వివరాలు నమోదు చేస్తారు. గతంలో ఏవైనా దివాలా తీశారా అనే వివరాలతో పాటు కోర్టు తీర్పులకు కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో మీ క్రెడిట్ ను తనిఖీ చేసిన సంస్థల వివరాలు కూడా పొందుపర్చుతారు.
ఇవి కూడా చదవండి
క్రెడిట్ స్కోర్ పెంచుకునే టిప్స్ ఇవే
- చెల్లింపుల చరిత్రే ఈ స్కోర్ పెరగడానికి కీలకంగా ఉంటుంది. ఆలస్యంగా చెల్లించినా, డీపాల్ట్ లు ఉన్నా స్కోర్ గణనీయంగా తగ్గిపోతుంది. మీ క్రెడిట్ నివేదికకు ప్రతికూలంగా మారతాయి. కాబట్టి బిల్లులను సకాలంలో చెల్లించాలి.
- క్రెడిట్ కార్డు పరిమితిలో 30 శాతానికి మించి వినియోగించకూడదు. ఆ పరిమితి దాటితే మీరు ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని భావిస్తారు. అది క్రెడిట్ స్కోర్ ను తగ్గిస్తుంది.
- తరచూ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నా, క్రెడిట్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నా మీ స్కోర్ దెబ్బతింటుంది.
- ప్రతి ఒక్కరూ తమ క్రెడిట్ నివేదికను క్రమానుగతంగా తనిఖీ చేసుకోవాలి. కొన్ని రుణాలు పొరపాటును మీ ఖాతాకు యాడ్ అయ్యి ఉండవచ్చు. వాటిని గుర్తిస్తే వెంటనే బ్యాంకు లకు సమాచారం ఇవ్వండి.
- పాత బకాయిలను చెల్లించడం, డిపాల్ట్ లను నివారించడం వల్ల స్కోర్ పెరుగుతుంది. అలాగే మీరు రుణాలను చెల్లించడంలో బాధ్యతగా వ్యవహరిస్తారని క్రెడిట్ నివేదిక చెబుతుంది.
- పాత ఖాతాలు మీ క్రెడిట్ చరిత్రను పెంచడానికి దోహదపడతాయి. వాటిని మూసివేస్తే మీ ఖాతా సగటు వయసు తగ్గిపోతుంది. దీని ద్వారా క్రెడిట్ స్కోర్ పై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి