పుష్ఫ ఫేమ్ డాలీ ధనంజయ దీపావళి పండగ రోజున శుభవార్త చెప్పాడు. త్వరలోనే తాను పెళ్లి చేసుకోనున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అంతేకాదు తనకు కాబోయే భాగస్వామిని కూడా పరిచయం చేశాడీ హ్యాండ్సమ్ హీరో. తన కాబోయే భార్యతో కలిసి ఓ అందమైన వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ధనుంజయ్ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ధనుంజయ్ కు ముందుస్తు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ధనంజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సినిమా ఇండస్ట్రీకి చెందినది కాదు. డాలీ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు ధన్యత. ఆమె ఫేమస్. డాలీ, ధన్యత ఒకరికొకరు చాలా సంవత్సరాలుగా తెలుసు. వీరిద్దరూ మైసూర్లో చదువుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా చిగురించింది. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారీ లవ్ బర్డ్స్.
కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న మైసూర్‌లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో డాలీ, తాన్యత వివాహం జరగనుంది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నారు. ఉదయం పెళ్లి జరగనుండగా, అదే రోజు రిసెప్షన్ కూడా అదే వేదికపై జరగనుంది. ధనంజయ్, ధన్యత మొదటిగా కలుసుకున్నది మైసూరులోనే. అందుకే అక్కడే పెళ్లిపీటలెక్కాలని ఈ ప్రేమ పక్షలు నిర్ణయించుకున్నారు.
ఇవి కూడా చదవండి
కాబోయే భార్యతో ధనుంజయ ఫొటో షూట్.. వీడియో..
ఇక ధనంజయ్ షేర్ చేసిన వీడియోలో తన కాబోయే భార్య కోసం అందమైన కవిత్వం కూడా రాశాడు. వీరిద్దరి క్యూట్ వీడియోకు అభిమానులు, నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న ధనుంజయ పుష్ఫ సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించాడు. అందులో జాలి రెడ్డి అనే నెగెటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక పుష్ఫ 2 లోనూ డాలీ ధనుంజయ్ పాత్ర మరింత పవర్ ఫుల్ గా ఉండనుందని తెలుస్తోంది. దీంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులు ధనుంజయ చేతిలో ఉన్నాయి.
ఫొటోషూట్ లో మెరిసిన ధనుంజయ్, ధన్యత..
సైమా అవార్డులో డాలీ ధనుంజయ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..