మనుషులకు కుక్కలకు మధ్య విడదీయలేని బంధం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శునకాలను ఇంట్లో కుటుంబ సభ్యుల్లాగా భావించే వారు ఎంతో మంది ఉంటారు. ఇక కుక్కలకు దెయ్యాలు కనిపిస్తాయని రాత్రుళ్లు అవి అరుపులు పెట్టడానికి ఇదే కారణమని కూడా కొంత మంది విశ్వసిస్తుంటారు. ఉదయం మాములుగా మోరిగే శునకాలు రాత్రుళ్లు మాత్రం అదో రకమైన అరుపుతో భయపెడుతుంటాయి.
రాత్రుళ్లు శునకాలు ఏడుస్తూ అరుస్తుంటాయి. దీంతో ఇది అపశనుకమని చాలా మంది విశ్వసిస్తుంటారు. కుక్కలు ఇలా ఏడవడం వల్ల ఏదో చెడు జరగబోతోందని భయపడుతుంటారు. మరి ఇంతకీ అసలు కుక్కలు ఎందుకు ఏడుస్తాయి.? వాటికి నిజంగానే దెయ్యాలు కనిపిస్తాయా.? ఇందులో నిజం ఎంతో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
శునకాలు రాత్రుళ్లు ఏడవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని చెబుతున్నారు. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం కుక్కలకు ఏవైనా అదృష్య శక్తులు కనిపించిన సమయంలో అలా అరుస్తాయని అంటుంటారు. వాటికి ఏదో ప్రతికూల శక్తి కనిపిస్తేనే అలా ఏడుస్తాయని చెబుతుంటారు. శునకాలు ఇలా ఏడవడం వల్ల ఆ వీధిలో ఎవరో మరణించబోతున్నారనడానికి సంకేతంగా చెబుతుంటారు.
ఇక పెట్ డాక్టర్ల అభిప్రాయం ప్రకారం. కుక్కలు ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతుంటేనే అలా ఏడుస్తాయని చెబుతున్నారు. ఇది అచ్చంగా మనుషుల్లోలాగే అని అంటున్నారు. ఏదైనా గాయం అయిన సమయంలో నొప్పిని భరించలేకే అలా ఏడుస్తాయని అంటున్నారు. ఇక ఇంట్లో పెంచుకునే శునకాలు ఇలా ఏడవడానికి అవి యజమాని అటెన్షన్‌ను కోరుకుంటోందని అర్థం.
యజమాని ఎక్కువసేపు దగ్గరకు రాకపోతే ఇలాంటి సంకేతం ఇస్తుందని అంటున్నారు. అలాగే కుక్కలు ఒంటరిగా ఫీలయిన సమయాల్లో కూడా ఇలాగే బిగ్గరగా అరుస్తాయని అంటున్నారు. సైన్స్ ప్రకారం కుక్కలు దెయ్యాలు కనిపిస్తే అరుస్తాయనడంలో ఎలాంటి నిజం లేదని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు నిపుణులు, పండితులు చెప్పిన అంశాలతో పాటు ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించనవ మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..