మీకు ఈ విషయం అర్థం కావడానికి ఇంకా ఈజీగా ఉండేలా ఓ ఉదాహరణ చెబుతాను. పదేళ్ల కిందట.. అంటే 2014లో డాలర్ విలువను మన రూపాయిల్లో లెక్కేస్తే.. దాదాపు 62 రూపాయిలు ఉంది. ఇప్పుడు 84 రూపాయిలు దాటింది. అంటే.. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు 2014లో లక్ష డాలర్లు ఇండియాకు పంపిస్తే.. అది మన కరెన్సీలోకి వచ్చేసరికి.. దాదాపు 62 లక్షలు అవుతుంది. అదే లక్ష డాలర్లను ఇప్పుడు పంపిస్తే.. 84 లక్షల రూపాయిలకు పైగా వస్తుంది. జస్ట్ పదేళ్లలో ఎంత తేడా వచ్చింది? 22 లక్షల రూపాయిలు. కాలం ముందుకు వెళుతున్న కొద్దీ డాలర్ విలువ పెరుగుతోంది. రూపాయి విలువ ఎవా ఉంటోందో చూస్తున్నాం. ఇంతకీ రూపాయి విలువ తగ్గితే ఎవరికి లాభం? రూపాయి విలువ పెరిగితే ఎవరికి నష్టం? అసలు దీనివల్ల మన భారతీయుల నిత్య జీవితంపై పడే ఎఫెక్ట్ ఎంత?
వస్తు తయారీ సంస్థలకు లాభాలు తెచ్చిపెడుతుంది
డాలర్లను మన దేశ కరెన్సీలోకి మారిస్తే.. ఎక్కువ మొత్తం వస్తుంది
రూపాయిల విలువ పడిపోతే ఏఏ రంగాలు లాభపడతాయో చూస్తే.. మన దగ్గరి నుంచి విదేశాలకు ఎగుమతి చేసేవాళ్లంతా మంచి ప్రయోజనం పొందుతారు. అంటే ఫార్మా, ఐటీతో పాటు ఎగుమతులు చేసే.. వస్తు తయారీ సంస్థలకు ఇది లాభాలు తెచ్చిపెడుతుంది. దీనికి అసలు కారణం ఏంటంటే.. వీళ్లు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేటప్పుడు.. తమకు రావలసిన మొత్తాన్ని డాలర్లలో తీసుకుంటారు. ఆ డాలర్లను మన దేశ కరెన్సీలోకి మార్చుకునేటప్పుడు.. ఎక్కువ మొత్తం వారికి వస్తుంది. అదే వారికి పెద్ద లాభం. దీంతోపాటు ప్రవాస భారతీయులు.. మన దేశంలో ఉన్నవారికి డబ్బు పంపించినా.. దాని వల్ల కూడా భారీగా లాభపడతారు. దీంతో పాటు మరో బెనిఫిట్ ఉంది. దేశంలోకి నిధుల ప్రవాహం పెరిగే ఛాన్సుంది. మన దేశానికి పర్యాటకులు కూడా క్యూ కడతారు. విదేశీ కంపెనీలకు అమ్మే వస్తుసేవల మార్కెట్ కూడా పెరుగుతుంది.
మన చమురు నిల్వలు.. మన అవసరాల్లో 12 శాతానికే సరిపోతాయి
మనకు అవసరమయ్యే చమురులో విదేశాల నుంచే 88 శాతం దిగుమతి
రూపాయి విలువ పడితే.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరుగుతాయి
విదేశాల నుంచి దిగుమతి చేసే ఫోన్లు, కెమెరాలకు ఎక్కువ చెల్లించాలి
రూపాయి విలువ పడిపోతే లాభాల సంగతి సరే. నష్టాల సంగతినీ చూడాలి కదా. కచ్చితంగా దీని ప్రభావం సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులు లేనిదే రోజు గడవదు. వీధి చివర కిరాణా షాప్ కి వెళ్లాలన్నా బండేసుకుని వెళ్లే రోజులివి. అందుకే పెట్రో ఉత్పత్తుల వినియోగం నానాటికీ పెరుగుతోంది. కానీ మన అవసరాలకు సరిపడా ఉత్పత్తి మన దేశంలో లేదు. మన దేశంలో ఉత్పత్తయే చమురు.. మన అవసరాల్లో 12 శాతానికే సరిపోతుంది. మిగిలిన 88 శాతం అవసరాలకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనికి మనం డాలర్లలో డబ్బును చెల్లించాల్సి ఉంటుంది. సో.. రూపాయి విలువ పడిపోయే కొద్దీ.. వారికి మనం ఇవ్వాల్సిన డాలర్లు పెరుగుతాయి. దీంతో మన కంపెనీలకు ఆర్థిక భారం తప్పదు. చివరకు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతాయి. ఫలితం.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పెరుగుతాయి. వీటి ధర కాని పెరిగితే.. ప్రజలకు ఎక్కడ ఎఫెక్ట్ కొడుతుందో తెలుసా? కూరగాయలు, నిత్యావసర వస్తువులపై దాని ప్రభావం ఉంటుంది. అంటే.. సామాన్యులపై ధరల పిడుగు పడినట్టే. ఇక విదేశాలతో సంబంధమున్న వస్తువసేవలు మరింత ఖరీదుగా మారతాయి. అంటే విదేశాల నుంచి ఫోన్లు, కెమెరాలు.. లేదా ఇతర వస్తువులు ఏవైనా సరే ఇంపోర్ట్ చేసుకుంటే.. భారీ మొత్తం ఖర్చవుతుంది. విదేశాలకు వెళ్దామన్నా.. బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.