డొనాల్డ్ ట్రంప్ మరోసారి అగ్రరాజ్య సింహాసనాన్ని అధిష్టించారు. కాసేపటి క్రితం అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హాల్‌లోని రోటుండా ఇండోర్‌లో ఆయన ప్రమాణం చేశారు. ఈ నేపధ్యంలో తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలుపుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక ట్వీట్ చేశారు.
‘నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. యూనైటెడ్ స్టేట్స్ 47వ అధ్యక్షుడిగా మీ చారిత్రాత్మక ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా! మన రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రపంచానికి మంచి భవిష్యత్తును రూపొందించడానికి నేను మరోసారి మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను. మున్ముందు విజయవంతమైన పదవీకాలం కోసం శుభాకాంక్షలు’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు!
Congratulations my beloved person President @realDonaldTrump connected your historical inauguration arsenic the 47th President of the United States! I look guardant to moving intimately unneurotic erstwhile again, to payment some our countries, and to signifier a amended aboriginal for the world. Best wishes for a…
— Narendra Modi (@narendramodi) January 20, 2025
కాగా, డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ప్రపంచ దేశాధినేతలు, వ్యాపార దిగ్గజాలు, సెలబ్రిటీలు, ట్రంప్ అనుచరులు హాజరయ్యారు. ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..