పరీక్షల సమయంలో విద్యార్థులు తీసుకునే ఆహారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే విద్యార్థుల ప్రిపరేషన్ లో ఎలాంటి అవాంతరాలు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే వారికి ముందు మంచి ఆహారం అందించాలు. వారికి ఇచ్చేవి బలవర్ధకమైనవే కాకుండా పోషకాలతో నిండి ఉండాలి. ఇంతకీ మీ పిల్లల్లో కాన్సంట్రేషన్ పవర్ పెంచే టూ ఇన్ వన్ ఆహార పదార్థాలేంటో చూద్దామా…
అరటి పండు పెడుతున్నారా..
అరటి పండే కదా అని తీసి పారేయకండి. ఈ పండ్లలో మెదడును అప్రమత్తంగా ఉంచే సహజమైన చక్కెర ఉంటుంది. అలాగే మీ మానసిక స్థితిని చిటికెలో ఉల్లాసంగా మార్చే గుణాలు అరటిపండులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు మీరు ఏదైనా విషయంలో ఒత్తిడికి గురవుతున్నప్పుడు ఒక అరటిపండును తిని చూడండి. మీ మూడ్ వెంటనే మారుతుంది. అలాగే స్టూడెంట్స్ కి కూడా అరటిపండు ను రెగ్యులర్ గా ఇవ్వడం ఎంతో మంచిది.
హైడ్రేటెడ్ గా ఉంచండి..
పిల్లలు ఒత్తిడికి గురవకుండా ఉండాలంటే వారు తగినంత నీరు తీసుకోవడం కూడా ఎంతో అవసరం. అలాగని అదే పనిగా కేవలం నీళ్లను మాత్రమే అధిక మొత్తంలో తీసుకోవడం మంచింది కాదు. నీటిని తగిన మోతాదులో తీసుకుని బాడీని హైడ్రేటెడ్ గా ఉంచగలిగితే వారిలో చిరాకు, అసలట వంటివి ఉండవని గుర్తుంచుకోవాలి.
డ్రైఫ్రూట్స్ తీసుకోండి..
డ్రైఫ్రూట్స్ లో ఉండే ఐరన్, ఇతర ఖనిజాల కరాణంగా ఇది మీ మెదడు ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. అంతేకాదు మెదడు బాగా పనిచేయాలంటే దానికి అవసరమైన ఆక్సిజన్ అందాలి. ఆ బాధ్యతను డ్రైఫ్రూట్స్ చక్కగా నెరవేర్చుతాయి. దీని ద్వారా పరీక్షల సమయంలో విద్యార్థుల ఏకాగ్రత పెంచడంలో ఇవి దోహదం చేస్తాయి.
ఓట్స్ తో టేస్టీగా..
ఓట్స్ లో తక్కువ మోతాదులో జీఐ ఉంటుంది. ఫైబర్, పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎక్కువ సమయం పాటు బాడీకి శక్తినిస్తాయి. అందుకే బ్రేక్ ఫాస్ట్ కి ఓట్స్ చాలా మంచి ఎంపికగా న్యూట్రిషన్స్ చెప్తుంటారు. దీనిని మీకు నచ్చిన ఫ్రూట్స్ తో కలిపి తీసుకోవడం వల్ల రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. పరీక్షలకు వెళ్లే పిల్లలకు కేలరీల కన్నా కూడా త్వరగా జీర్ణమయ్యే ఆహారమే ఎక్కువ అవసరం.
విటమిన్ ఇ పుష్కలంగా..
తఈణ ధాన్యాలతో తయారు చేసిన ఆహారం పిల్లలకు అన్నిరకాల పోషకాలను ఇవ్వగలదు. వాటితో తయారు చేసిన బ్రెడ్, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటివి మెదడుకు రక్తప్రసరణను అందేలా చేస్తాయి. దీంతో సహజంగానే పిల్లలు ఎక్కువసేపు ఏకాగ్రతతో చదవగలుగుతారు.
డార్క్ చాక్లెట్..
డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి వారిలో మెమరీ పవర్ ను త్వరగా స్పందించే వేగాన్ని అందిస్తాయి. దీంతో చదివిన విషయాలను మెదడు చురుగ్గా గ్రహించడమే కాకుండా వాటిని అవసరమైన చోట రీ కలెక్ట్ చేస్తుంది కూడా. కాబట్టి జంక్ ఫుడ్ కి బదులుగా మీ పిల్లల డైట్ లో డార్క్ చాక్లెట్ ఉండేలా చూసుకోండి.
అన్నీ బ్యాలెన్స్ చేస్తేనే..
చదువుకునే పిల్లలకు శారీరకంగా ఎక్కువ శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వారికి వీలైనంత సాత్వికాహారమే అందించేలా ప్లాన్ చేసుకోండి. దీంతో పాటు తేలిక పాటి వ్యాయామాలు, వాకింగ్ కూడా వారి మూడ్ ను ఇట్టే మార్చగలవు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని చదివేబదులు కాసేపు వాకింగ్ కి వెళ్లేలా చూడండి. దీంతో పాటు తగినంత నిద్ర వారికి ఉండేలా జాగ్రత్త తీసుకోండి.