మారుతున్న ఆర్థిక రంగంలో స్థిరత్వం, హామీ రాబడిని కోరుకునే వారికి నమ్మకమైన ఎంపికగా ఎఫ్డీలు ముందు వరుసలో ఉన్నాయి. భారతదేశపు అగ్రశ్రేణి బ్యాంకులుగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కస్టమర్ల నుంచి డిపాజిట్లను ఆకట్టుకునేందుకు నమ్మలేని వడ్డీ రేటును అందిస్తున్నాయి. మూడేళ్ల ఎఫ్డీపై ఈ రెండు బ్యాంకులు ఆకర్షణీయ వడ్డీను అందిస్తున్నాయి. ఈ బ్యాంకుల వడ్డీ రేట్లు, కనీస డిపాజిట్ అవసరాలు, అకాల ఉపసంహరణకు జరిమానాలు వంటి అదనపు అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
వడ్డీ రేట్లు ఇలా
రిటైల్ డొమెస్టిక్ టర్మ్ డిపాజిట్లపై ఎస్బీఐలో వడ్డీ రేట్లు 3 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్ ఎఫ్డీ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధిని అందిస్తుంది. మూడేళ్ల నుంచి ఐదేళ్ల కంటే తక్కువ కాల వ్యవధి ఎఫ్డీ కోసం వడ్డీ రేటు సాధారణ ప్రజలకు- 6.75 శాతంగా ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.25 శాతంగా ఉంది. అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మూడు సంవత్సరాల మెచ్యూరింగ్ ఎఫ్డీ కోసం వేరే కాల వ్యవధిని కలిగి ఉంది. రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల ఎఫ్డీ వడ్డీ రేటు సాధారణ ప్రజలకు 7 శాతం ఉంటే సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వడ్డీను అందిస్తున్నారు.
మెరుగైన రాబడినిచ్చే ఎఫ్డీ ఇదే
మూడు సంవత్సరాల ఎఫ్డీ కోసం పీఎన్బీ సాధారణ, సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుంది. అయితే తాజా రేట్లను నేరుగా బ్యాంకులతో ధ్రువీకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పాలసీ అప్డేట్ల ఆధారంగా మారవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి