ప్రతి నెల 1వ తేదీ రాగానే గ్యాస్ సిలిండర్ ధరల్లో ధరలు మారుతుంటాయి. ఆయిల్ కంపెనీలు సిలిండర్ ధరలను సవరిస్తుంటాయి. అలాగే ఫిబ్రవరి 1వ తేదీన కూడా గ్యాస్ సిలిండర ధరలను సవరించాయి. భారతదేశంలో, చమురు మార్కెటింగ్ కంపెనీలు 14 కిలోల దేశీయ, 19 కిలోల వాణిజ్య సిలిండర్ల ధరలను నిర్ణయిస్తాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్‌పిజి సిలిండర్ ధరల్లో మార్పు ఉంటుంది. దీని నుండి CNG , PNG ధరలు నిర్ణయిస్తుంటాయి. దేశ సాధారణ బడ్జెట్‌కు ముందు సామాన్య ప్రజలకు చాలా శుభవార్త అందింది. ఫిబ్రవరి 1వ తేదీన తెల్లవారుజామున ప్రభుత్వ చమురు మార్కెట్ కంపెనీలు సిలిండర్ ధరలను మరోసారి తగ్గించాయి. అదే సమయంలో OMCలు, ఇంధనం ధరను భారీగా పెంచాయి. దీని కారణంగా విమాన ప్రయాణం ఖరీదైనది కావచ్చు. ఎల్‌పీజీ సిలిండర్, ATF కొత్త ధరలు ఈ రోజు నుండి అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.
ఇది కూడా చదవండి: Gold Price Today: బడ్జెట్ రోజు మహిళలకు షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
LPG సిలిండర్ ధరలు ఎంత తగ్గాయి?
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా రెండో నెలలో తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.7 తగ్గగా, ధర రూ.1,797కి చేరింది. కోల్‌కతాలో కనిష్టంగా రూ.4 తగ్గింపు, ధర రూ.1907గా మారింది. ముంబై, చెన్నైలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.6.5 తగ్గింది. ఆ తర్వాత రెండు మెట్రోలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు వరుసగా రూ.1749.50, రూ.1959.50గా మారాయి.
19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను తగ్గించాయి. రూ.7 తగ్గింది. కొత్త ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు.
మెట్రో నగరాల్లో 19కేజీల సిలిండర్ ధర
- ఢిల్లీ – రూ. 1797.00
- కోల్‌కతా – రూ.1907.00
- ముంబై – రూ. 1749.50
- చెన్నై – రూ. 1959.50
- హైదరాబాద్ – రూ.2,023
డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు
మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో వరుసగా 11వ నెలలో ఎలాంటి మార్పు లేదు. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో చివరి మార్పు మార్చి 2024లో జరిగింది. ప్రభుత్వ ప్రకటన తర్వాత IOCL డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను ఫ్లాట్ రూ.100 తగ్గించింది. హోలీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్పించేందుకు ప్రయత్నించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు కనిపించలేదు. అప్పటి నుంచి ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.803గా కొనసాగుతోంది. మరోవైపు కోల్‌కతాలో రూ.829, ముంబైలో రూ.802.50, చెన్నైలో రూ.818.50, హైదరాబాద్‌లో రూ.855గా ఉంది.
ఇది కూడా చదవండి: Bank Holidays In February 2025: వినియోగదారులకు అలర్ట్.. ఫిబ్రవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు.. ఏయే తేదీల్లో అంటే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడక క్లిక్ చేయండి