బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది, మోదీ మరోసారి ప్రధాని అవుతారన్న వార్త వచ్చినప్పుడు అదానీ స్టాక్స్ పెరిగాయి. అదానీ కంపెనీపై ఒక్క మరక పడగానే.. దలాల్‌స్ట్రీల్ షేక్ అవుతుంది, స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతాయి. అదానీ ఏ రాష్ట్రంతోనైనా వ్యాపార ఒప్పందం చేసుకుంటే.. ప్రతిపక్షాలు విరుచుకుపడతాయి. కాని, అదానీని విమర్శించే రాష్ట్రాలే మళ్లీ అదానీ పెట్టుబడులను కోరుకుంటుంటాయి. ‘అదానీ.. అదానీ.. అదానీ’. బహుశా ఇంత చిత్రవిచిత్ర పరిస్థితి మనదగ్గరే ఉంటుందేమో. భారత ఆర్థిక వ్యవస్థ, భారత రాజకీయ రంగంతో దాదాపుగా విడదీయలేని పేరు.. ఈ ‘అదానీ’. ప్రస్తుతం అదానీ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు ఫైల్ అయింది. అలాంటి ఇలాంటి కేసు కాదు. చాలా సీరియస్ కేసు. ఎందుకో తెలుసా. ‘లంచం’ ఇచ్చారని. అయినా.. ఇక్కడ చాలా మందికి అర్థం కాని మ్యాటర్ ఏంటంటే.. ‘ఇండియాలో అధికారులకు లంచం ఆఫర్ చేస్తే, అమెరికాలో కేసు ఎందుకు ఫైల్ అయింది’..? ఏకంగా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్- FBI ఎందుకని ఎంటర్ అయింది..? ఇదీ ఇంట్రస్టింగ్ క్వశ్చన్.
అదానీ కంపెనీ లంచం ఇచ్చిందా ఇవ్వలేదా? ఇస్తే ఏ రాష్ట్రంలో, ఎవరెవరికి, ఎంతెంత ఇచ్చారు? అమెరికా దగ్గర ఈ వివరాలన్నీ ఉన్నాయ్.. విత్ ప్రూఫ్స్. ఎవరెవరికి ఎన్ని కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే లెక్కలు ఎక్సెల్ షీట్‌లో, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో, ఫోన్లలో రికార్డ్ అయ్యాయి. అవన్నీ.. అమెరికా కోర్టు ముందు ఉన్నాయి. ఆ డిటైల్స్ కూడా చెప్పుకుందాం. కాకపోతే.. ఇందాక ఓ క్వశ్చర్ రైజ్ చేశాం. ‘ఇండియాలో లంచం ఇస్తే అమెరికాలో కేసు ఎందుకు’ అని. దానికి చాలా ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఉంది.
అమెరికాలో ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అనే ఓ చట్టం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం నుంచే ఉందనుకోండి. కాని, ఆ చట్టంలో లూప్‌హోల్స్‌ను సరిచేస్తూ మరింత పకడబ్బందీగా తయారు చేశారు. ఆ చట్టం ప్రకారం.. ‘ఏ కంపెనీ అయినా అమెరికాలో నిధులు సమీకరిద్దాం అని అనుకుంటే.. Like, అప్పుల రూపంలో గానీ, బాండ్స్ ఇష్యూ చేసి ఫండ్స్ సేకరించడం గానీ చేయాలనుకుంటే.. సదరు కంపెనీకి క్లీన్ రికార్డ్ ఉండాలి. అఫ్‌కోర్స్ అది అమెరికా కంపెనీ కాకపోయినా సరే.. కచ్చితంగా ట్రాక్ రికార్డ్ క్లీన్‌గా ఉండాల్సిందే. ప్రపంచంలో చాలా దేశాల్లో వ్యాపారం చేస్తున్నాం.. అమెరికాలోనూ వ్యాపారం చేస్తాం అంటే కుదరదు. ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం.. నిజాయితీగా వ్యాపారం చేసే కంపెనీ అయి ఉండాలి. ఒకవేళ.. లంచాలు ఇచ్చి బిజినెస్ చేస్తే.. ‘ఆ లంచం ఇచ్చేది అమెరికాలోనే కాకపోవచ్చు, వేరే ఎక్కడైనా కావొచ్చు’.. ఒకవేళ లంచం ఇచ్చి వ్యాపారం చేస్తున్నట్టు తేలితే.. అమెరికాలో ప్రాసిక్యూట్ చేయొచ్చు. అదానీ విషయంలో జరిగింది ఇదే.
ఇవి కూడా చదవండి
ఇంకాస్త డిటైల్డ్‌గా చెప్పుకోవాలంటే. సపోజ్ ఓ పాకిస్తాన్ కంపెనీ ఉందనుకోండి. ఆ కంపెనీ విపరీతంగా లంచాలు ఇచ్చి, అవినీతి చేసి, తన వ్యాపారాన్ని విస్తరించిందే అనుకుందాం. అలాంటి కంపెనీ గనక అమెరికాలో వ్యాపారం చేస్తే ‘ఈ ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్’పై సంతకం చేయాలి. అంటే మీనింగ్.. ‘మేం అవినీతి చేయలేదు, అక్రమాలకు పాల్పడలేదు, నిజాయితీగానే వ్యాపారం చేశాం’ అని ఒప్పుకోవడం అన్నమాట. ఒకవేళ దానిపై సంతకం చేసి, ఎప్పుడైనా లంచాలు ఇచ్చి, అవినీతి చేశారనే ఆరోపణలు వస్తే మాత్రం అమెరికా వదిలిపెట్టదు. సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన కియా కంపెనీ గురించి కూడా చెప్పుకోవాలి. కియా మోటార్స్ అమెరికా కంపెనీ కాదు. అది దక్షిణ కొరియా కంపెనీ. ఆంధ్రప్రదేశ్‌కు కియా కంపెనీ వస్తున్నప్పుడు ‘కూడా ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్’ మీద సంతకం చేయాల్సిన సందర్భం వచ్చింది. ‘మీకు ఏమైనా లంచాలు ఇచ్చారా, బిడ్డింగ్‌లో గానీ, మరే ఇతర సందర్భంలో గానీ అవినీతి జరిగిందా’ అని ఆ చట్టం ప్రశ్నిస్తుంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం కియాతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఈ యాక్ట్‌పై సంతకం చేసింది. ఎందుకంటే.. అక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు కాబట్టి. సో, కియా అమెరికాలో వ్యాపారం చేస్తున్నందుకు, అవి ప్రొడ్యూస్ అయ్యేవి అనంతపురంలో కాబట్టి ఆ యాక్ట్‌పై సంతకం చేసింది. ఇప్పుడు అదానీపై వచ్చిన ఆరోపణలు చూద్దాం. అదానీ కంపెనీ ఇండియాలో వ్యాపారం చేస్తూ, కొందరు అధికారులకు లంచం ఇచ్చిందనేది అమెరికా కోర్ట్ ఆరోపణ. సో, ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అది చట్టవిరుద్దం. అందుకే, ఇండియాలో లంచం ఇచ్చిందనే ఆరోపణలకు అమెరికాలో కేసు ఫైల్ అయింది గౌతమ్ అదానీపై.
ఇంకాస్త డిటైల్డ్ చెప్పుకుందాం. అదానీపై అమెరికన్ కోర్టు ఎందుకంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలనుకుందో చూద్దాం. అదానీ అంటే ఒక్క కంపెనీ కాదు. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ, అదానీ పవర్.. ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లోని ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’పైనే ఈ ఆరోపణలన్నీ. ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అనే కంపెనీ బాండ్ల రూపంలో అమెరికాలో 600 మిలియన్ డాలర్ల నిధులు సేకరించాలనుకుంది. అంటే, మన కరెన్సీ ప్రకారం అటుఇటుగా 5వేల 600 కోట్ల రూపాయలు. బాండ్లు, అప్పుల రూపేణా మొత్తం 25వేల కోట్ల రూపాయల వరకు సేకరించారు. ఇంత అప్పు తీసుకుంటున్నప్పుడు.. ఆదాయం కూడా చూపించాలిగా. తన వ్యాపారం, వచ్చే ఆదాయం, అందులోని లాభాల గురించి చెప్పి మరీ నిధుల సమీకరణకు వెళ్లింది అదానీ గ్రీన్ ఎనర్జీ. తమకు అన్ని ట్యాక్సులు పోనూ.. 20 ఏళ్లలో 16వేల 800 కోట్ల రూపాయల లాభం వచ్చే సోలార్ ఎనర్జీ బిజినెస్‌పై అగ్రిమెంట్లు చేసుకున్నామని చెప్పింది. ఏకంగా 17వేల కోట్ల లాభం వచ్చే అగ్రిమెంట్స్ చూపించింది కాబట్టి.. అప్పులు ఇచ్చేందుకు, కంపెనీ బాండ్లు కొనేందుకు చాలామంది ఆసక్తి చూపారు. అమెరికన్ ఇన్వెస్టర్లతో పాటు కెనడా, ఇతర దేశాల ఇన్వెస్టర్లు కూడా నిధులు సమకూర్చిన వాళ్లలో ఉన్నారు. అయితే.. ఇక్కడే అసలు కిటుకు దాగుంది. అమెరికాలో ఇలా ఫండ్స్ సేకరించాలన్నా సరే.. ఫారెన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారం సంతకం చేయాలి. అదానీ కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు కూడా. కాని, ఆ తరువాత తేలిందేంటంటే.. తమకు 17వేల కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పి.. ఏవైతే అగ్రిమెంట్లు కుదుర్చున్నారో.. ఆ అగ్రిమెంట్ల వెనక లంచం వ్యవహారం జరిగిందనేది ప్రధాన ఆరోపణ. లంచం అంటే పది కోట్లో, వంద కోట్లో అనుకునేరు..! ఏకంగా 2100 కోట్ల రూపాయలను భారతదేశంలోని వివిధ రాష్ట్రాల అధికారులకు లంచంగా ఇచ్చారనేది అమెరికా కోర్టు చేసిన భారీ ఆరోపణ.
ఇంతకీ.. భారత అధికారులకు లంచం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అదానీ గ్రీన్ ఎనర్జీ చేస్తున్న వ్యాపారం ఏంటి? ఆ డిటైల్స్ కూడా చూద్దాం. ఇండియాలో గ్రీన్ ఎనర్జీ వాడకాన్ని పెంచుదాం అనే థీమ్ ఎప్పటి నుంచో ఉంది. ఇందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లను ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ షార్ట్‌కట్‌లో ‘సెకి’ అనే సంస్థ ఉంది. ఈ కంపెనీ నుంచి రాష్ట్రాలు గ్రీన్ ఎనర్జీని కొంటాయి. అంటే.. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్ అన్నమాట. జనరల్‌గా కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నుంచి విద్యుత్ కొంటే ఎలాంటి ఇష్యూ ఉండదు. ఎందుకంటే.. కేంద్రం సంస్థ నుంచి కొనే కరెంట్‌కు లంచాలు, అవినీతి చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు కాబట్టి. కానీ, ఇందులోనే ఓ తిరకాసు ఉంది. ఈ ‘సెకి’ అనే సంస్థకు రాష్ట్రాల అవసరాలు తీర్చేంత సోలార్ పవర్ జనరేట్ చేసే సామర్ధ్యం లేదు. సెకి అనేది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థే అయినా.. అది కూడా ప్రైవేట్ కంపెనీల నుంచే కరెంట్ కొనేది. ఆ ప్రైవేట్ కంపెనీ మరేదో కాదు.. ‘అదానీ గ్రీన్ ఎనర్జీ’. ‘సెకి’కి సోలార్ విద్యుత్‌ను ఎక్కువగా అమ్ముతున్న కంపెనీ ‘అదానీ గ్రీన్ ఎనర్జీనే’. సో, ‘సెకి’కి వ్యాపారం జరిగితే అల్టిమేట్‌గా అది అదానీ గ్రీన్ ఎనర్జీకి జరిగినట్టే కదా. అందుకే, గౌతమ్ అదానీ వివిధ రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి.. ఈ ‘సెకి’ నుంచి కరెంట్ కొనేలా చేసేవారు, అందుకు కొందరు అధికారులకు లేదా ప్రభుత్వ పెద్దలకు లంచాలు ఇచ్చారు అనేది ప్రధాన ఆరోపణ. ‘సెకి’తో ఒప్పందానికి లంచాలు ఇచ్చి మరీ వివిధ రాష్ట్రాలతో అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారనేది గౌతమ్ అదానీపై ఫైల్ అయిన కేసు. కానీ, ఇలా లంచాలు ఇచ్చి అగ్రిమెంట్లు కుదుర్చుకున్న విషయాన్ని గౌతమ్ అదానీ దాచి పెట్టారని న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. అంటే.. అవినీతి చేయలేదనే విషయం దాచి, అందరినీ తప్పుదారి పట్టించి, తప్పుడు సమాచారం ఇచ్చి.. అమెరికాతో పాటు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు 25వేల కోట్ల రూపాయలు సమీకరించారంటూ పెద్ద కేసు వేశారిప్పుడు. అదీ జరిగింది.
ఎవరో కిందిస్థాయి అధికారులు చేసిన తప్పుకు.. ఏకంగా గౌతమ్ అదానీని అరెస్ట్ చేసేస్తారా? ఈ క్వశ్చన్ వినిపిస్తోంది చాలామంది నుంచి. కాని, అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ కమిషన్ ఒక కేసును టేకప్ చేసి, అందులో ఫ్రాడ్ జరిగిందని గుర్తిస్తే మాత్రం.. ఆ కేసు అంత ఆషామాషీగా ఉండదు. పైగా పైగా అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ కమిషన్‌కు యాక్టింగ్ డైరెక్టర్లుగా ఇద్దరు ఇండియన్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు. SEC ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్‌గా సంజయ్ వాద్వా, ఆ కేసును పర్యవేక్షిస్తున్న తేజల్ డి షా. ఈ ఇద్దరు సబ్జెక్ట్ ఉన్నోళ్లు. ఎవిడెన్స్ లేకుండా, వాళ్ల ముందు ఎలాంటి పేపర్స్ లేకుండా.. విషయాన్ని ఇంత వరకు తీసుకెళ్లరు, SECలో కేసు పెట్టలేరు.
ఇది చదవండి: బయట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా..? తింటే ఇక పోతారు అంతే..
సో, అదానీ కంపెనీ లంచాలు ఇచ్చి.. 20 ఏళ్ల పాటు లాభాలు వస్తాయని అగ్రిమెంట్లు కుదుర్చుకుని.. వాటిని అమెరికాలో చూపించి.. డబ్బులు సమీకరించారనే దానికి ప్రూఫ్స్ ఉన్నాయంటున్నారు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు. అలా అమెరికా నుంచి సమీకరించిన డబ్బులను ఇండియాలో లంచంగా ఇస్తామంటే ఎలా ఊరుకుంటామనేది యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రధాన ఆరోపణ. అంటే.. అమెరికా ఇన్వెస్టర్ల దగ్గర నిధులు సేకరించుకుని, ఇండియాలో లంచాలు ఇచ్చి పెద్దవాళ్లం అయిపోతామంటే తామెందుకు చూస్తూ ఊరుకుంటామని యూఎస్ అటార్నీ బ్రియాన్ పీస్ కీలక కామెంట్ చేశారు. అమెరికా మార్కెట్ల విశ్వసనీయతను ఫణంగా పెట్టి.. తమకు తాము సంపన్నులం అయిపోవాలనుకునే వారిని వదిలిపెట్టేది లేదని అల్టిమేటం ఇచ్చారు.
ఇంతకీ ఈ కేసుతో గౌతమ్ అదానీకి ఏంటి సంబంధం? ఆయన జస్ట్.. కంపెనీని నడిపిస్తారు గానీ.. దగ్గరుండి మరీ లంచాలైతే ఇవ్వరు కదా? ఈ ప్రశ్న కూడా వినిపిస్తోంది చాలా మంది నుంచి. కాని, న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెప్పిన బాంబ్‌బ్లాస్టింగ్ మ్యాటర్ ఏంటో తెలుసా. అధికారులకు, రాజకీయ పెద్దలకు లంచాలు ఇవ్వడానికి గౌతమ్ అదానీనే స్వయంగా వెళ్లి వ్యక్తిగతంగా కలిశారు అని. అలా ఎలా చెబుతారండీ.. ఇండియాలో ఎవరెవరిని కలిశారనే విషయం అమెరికాకు ఎలా తెలుసు? ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అని అడుగుతారా..! ప్రూఫ్స్ అంటే ఏవో నాలుగు పేపర్లలో రాసి ఉన్నవి కావు అమెరికా దగ్గర ఉన్నవి. ఏ రాష్ట్రంలో, ఏ అధికారికి, ఏ రాజకీయ నేతకు ఎన్నేసి కోట్ల రూపాయల లంచం ఇచ్చారనే డిటైల్స్ కంప్లీట్‌గా ఉన్నాయి. లంచం వ్యవహారంలో గౌతమ్ అదానీని డైరెక్టుగా పిలవకుండా ‘న్యూమెరో యునో’, ‘బిగ్ మ్యాన్’ అనే కోడ్ పేర్లతో అదానీ పేరుని ప్రైవేట్‌గా ప్రస్తావించారనే ఆధారాలు ఉన్నాయి. నిజానికి ఈ కేసు ఇప్పటిది కాదు. 2022 నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీపై ఆరోపణలు ఉన్నాయి. సో, అప్పటి నుంచే సీరియస్‌గా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాంటి సమయంలో.. గౌతమ్ అదానీ బంధువు సాగర్ అదానీని దగ్గరి నుంచి సెల్‌ఫోన్‌ను సీజ్ చేశారు. అందులో ఎవరెవరికి లంచం ఆఫర్ చేశారనే ట్రాక్ రికార్డ్ ఉందంటున్నారు. ఇక వినీత్ ఎస్.జైన్ అనే వ్యక్తి సెల్‌ఫోన్‌లో.. ఎవరెవరికి ఎంతెంత లంచం ఇచ్చారు, ఆ అకౌంట్స్ ఏంటనే డిటైల్స్ ఉన్నాయి. రూపేశ్ అగర్వాల్ అనే వ్యక్తి.. ఆ లంచాన్ని ఏ రూపంలో ఇవ్వాలనే దానిపై పవర్ పాయింట్, ఎక్సెల్‌లో సేవ్ చేసుకున్నారంటున్నారు. ఈ ఆధారాలన్నీ అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ముందున్నాయి. ఆధారాలు లేకపోతే.. అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంత ఈజీగా వేలు పెట్టదు కదా.
ఇండియాలో కూడా ఈ వ్యవహారంపై సివిల్ కేసు ఫైల్ అయింది. స్వయంగా సెబీనే ఈ కేసు వేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి మరీ.. అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందంటూ అదానీ గ్రీన్ ఎనర్జీపై ఆరోపణలు గుప్పిచింది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి, జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు కూడా విధించాలని రెగ్యులేటర్లను కోరింది. మరోవైపు.. అదానీపై యాక్షన్ తీసుకోవాలంటూ, అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇన్ని ఆరోపణల మధ్య అదానీ గ్రూప్ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చింది. సోలార్ పవర్ కాంట్రాక్టులకు దక్కించుకోవడం కోసం తాము ఎవరికీ లంచం ఇవ్వలేదంటూ క్లారిటీ ఇచ్చింది. అమెరికా ప్రాసిక్యూటర్లు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని సమాధానం ఇచ్చింది. తాము చేసే వ్యాపారాలన్నీ చట్టాలను అనుసరించే చేస్తామని వివరణ ఇచ్చింది. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్న కేసుపై న్యాయపరంగా ముందుకెళ్తామని కూడా క్లారిటీ ఇచ్చింది.
ఇది చదవండి: తెల్లారి వాకింగ్ చేస్తుండగా కనిపించిన నల్లటి బ్యాగ్.. తెరిచి చూడగా
ఒక కంపెనీపై మరక పడితే.. జరిగే నష్టం అంతా ఇంతా ఉండదు. అందుకే, ఆ ఆరోపణలు రాగానే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు కోల్పోయింది. గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద ఏకంగా లక్ష కోట్ల రూపాయలు క్షీణించింది. ఇప్పుడనే కాదు.. గతంలో హిండెన్‌బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ ఆరోపణలు చేసినప్పుడు కూడా అదానీ గ్రూప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్ తన ఏడు లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలు పెంచుకోడానికి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ సంచలన రిపోర్ట్ బయటపెట్టింది హిండెన్‌బర్గ్. షేర్ల ధరలు విపరీతంగా పెరిగేలా చేసి, వాటిని తాకట్టు పెట్టి మరిన్ని అప్పులు తెచ్చారని బాంబ్ పేల్చింది. స్టాక్ మానిప్యులేషన్‌తో పాటు అకౌంటింగ్ మోసాలు కూడా జరిగాయని అప్పట్లో ఆరోపించింది హిండెన్‌బర్గ్. కాని, హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలను అదానీ కంపెనీ కొట్టిపారేసింది. దీనిపై విచారణ జరిపిన సెబీ కూడా అదానీ గ్రూప్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే.. ఇలా క్లీన్ చిట్ ఇవ్వడంపైనే చాలా విమర్శలు వచ్చాయి. సెబీ ఛైర్ పర్సన్ మాధవి పూరి బచ్‌కు అదానీ గ్రూప్ ఆఫ్‌షోర్ ఫండ్స్‌లో వాటా ఉందంటూ మరో బాంబ్ పేల్చింది హిండెన్‌బర్గ్. ఆ కారణంగానే అదానీకి సెబీ క్లీన్ ఇచ్చిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఏదేమైనా.. ఆ ఇష్యూ అక్కడితో సెటిల్ అయిపోయింది. కాని, ప్రస్తుతం వచ్చిన ఆరోపణలు మాత్రం అత్యంత తీవ్రమైనవి. సోలార్ పవర్ అగ్రిమెంట్ల కోసం అధికారులకు, రాజకీయ పెద్దలకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు చాలా పెద్దవి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు అంత ఈజీగా వదిలిపెట్టేలా లేవు. ఆల్రడీ ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ఆధారాలు లేకపోయినా తనను అరెస్ట్ చేశారని, ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు అదానీని ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు.
మరోవైపు.. అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి కూడా సీరియస్ యాక్షన్ ఉండబోతోందంటున్నారు. ఆల్రడీ.. గౌతమ్ అదానీ, సాగర్ అదానీలతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానీ గ్రీన్ ఎనర్జీ అధికారులు, వినీత్ జైన్‌కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసినట్టు కూడా కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. మరోవైపు.. అమెరికా-భారత్ మధ్య ఓ ఒప్పందం ఉంది. ఆ ఒప్పంద ప్రకారం.. నేరస్తులతో పాటు ఇలాంటి వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా అప్పగించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు.. ఒప్పందంలో భాగంగా గౌతమ్ అదానీని అమెరికా ప్రభుత్వానికి అప్పగించేంత ధైర్యం చేస్తారా అనేది పెద్ద క్వశ్చన్.
ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. జనవరి 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ఆయన గెలవగానే.. ట్రంప్‌కు శుభాకాంక్షలు చెబుతూ.. త్వరలోనే అమెరికాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని, 15వేల ఉద్యోగాలు కల్పిస్తామని ట్వీట్ చేశారు గౌతమ్ అదానీ. నిజానికి.. ట్రంప్ కూడా గ్రీన్ ఎనర్జీని ఎంకరేజ్ చేస్తామనే చెప్పారు. ‘మీ ప్రయత్నానికి మావంతు సాయం అందిస్తా’ అన్నట్టుగా ఆయనకు సపోర్ట్ చేస్తూ వచ్చారు అదానీ. ఈ పరిస్థితుల్లో గౌతమ్ అదానీపై యాక్షన్ తీసుకుంటారా అంటే.. అనుమానమే. పైగా యూఎస్ అటార్నీ పోస్టులను ప్రక్షాళన చేస్తానంటూ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. సో, ఎవరైతే అదానీపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పారో.. ఆ అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్‌ను కూడా తప్పించే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ కేసుకు సీరియస్‌నెస్ ఉన్నా.. ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. అంటే.. మరో హిండెన్‌బర్గ్ తుఫాన్‌లా విరుచుకుపడి, తీరం దాటేలాగే ఉందంటున్నారు మార్కెట్ విశ్లేషకులు.
ఇది చదవండి: విశాఖలో ఉన్నట్టుండి వెనక్కి వెళ్లిన సముద్రం.. ఎన్ని మీటర్లో తెలిస్తే..
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.