సాధారణంగా చలికాలంలో జీవనశైలిలో కొద్ది పాటి మార్పులు చేసుకోవడం చాలా అవసరం. లేదంటే శరీరంలో అనేక రకాల సమస్యలతో పాటు అనారోగ్యానికి దారి తీసే కారకాలు తిస్టవేస్తాయి. కాబట్టి మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ సీజన్‌లో వంటిట్లో ఉండే అనేక రకాల ఆహార పదార్థాలు దాదాపు మూడు వంతుల సమస్యలను తగ్గించగలవు. చలికాలంలో శారీరక శ్రమ తగ్గడం, ధమనులు కుంచించుకుపోవడం వల్ల రక్తపోటు పెరగడం ప్రారంభమవుతుంది. అందులోనూ ఒత్తిడి పెరిగినప్పుడు మన రోజువారీ పని కష్టంగా మారుతుంది. ఇతరులతో పోలిస్తే అలాంటి వారికి బీపీ సమస్యలు వచ్చే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ వేయించిన ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం చేయకపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో వీలైనంత వరకు కొన్ని సహజమైన పదార్ధాలు ఆహారంలో చేర్చుకోవడం చాలా అవసరం. అవేంటంటే..
సాధారణంగా అల్లం ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి సహజమైన ఆహారం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అల్లం తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా అనేక ఇతర వ్యాధులను నయం చేస్తుంది. కాబట్టి చలికాలంలో అల్లంను మీ ఆహారంలో తప్పక భాగం చేసుకోవాలి.
ఇందులో అనేక బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడంలో సహాయపడతాయి. అల్లంలో జింజెరాల్, షోగోల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఈ అంశాలన్నీ బీపీ రోగులకు మేలు చేస్తాయి.
ఇవి కూడా చదవండి
అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. శరీరంలోని ఏ భాగానైనా మంటను తగ్గించేందుకు ఇవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాగే అల్లం తినడం వల్ల శరీరం డిటాక్సిఫై అవుతుంది. కీళ్లు, కండరాలలో నొప్పి ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చలికాలంలో సాధారణంగా వచ్చే జలుబు, దగ్గులకు అల్లం ఎఫెక్టివ్ రెమెడీ కూడా. బరువు తగ్గాలంటే అల్లం తింటే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటితో పాటు, అల్లం తినడం వల్ల వైరల్, సీజనల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదల నుంచి రక్షణ వలయం ఏర్పడుతుంది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.