రాజమండ్రిలో జీఆర్టీ జువెలర్స్ సరికొత్త టెక్నాలజీతో కొత్త షోరూంను ప్రారంభించింది. ప్రింట్ ప్రకటనలు మిక్స్‌డ్ రియాలిటీ (ఎంఆర్) వైపు మలుపు తీసుకుంటున్న ప్రస్తుత కాలంలో.. ఫ్లామ్, జీఆర్‌టీ జువెలర్స్ కలిసి రాజమండ్రిలో కొత్త షోరూమ్ ప్రారంభం కోసం వినూత్నంగా రూపొందించిన మిక్స్ డ్ రియాలిటీ ప్రకటనను విడుదల చేసింది. మిక్స్డ్ రియాలిటీలో అగ్రగామిగా ఉన్న ఫ్లామ్.. ప్రింట్, డిజిటల్, అవుట్ ఆఫ్ హోమ్ (ఓఓహెచ్), టెలివిజన్ వంటి వివిధ మీడియాల్లో ప్రకటనల రంగాన్ని మరింత విస్తరిస్తోంది. ఈ ఎంఆర్ అనుభవాన్ని ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ తెలుగు పత్రికలలో ప్రచురించారు.
- సరికొత్త టెక్నాలజీతో ప్రకటనలు సృష్టిస్తున్న ఫ్లామ్
- వినియోగదారులను ఆకర్షించే అద్భుతమైన ప్రకటనలు
ఈ మిక్స్ డ్ రియాలిటీ ప్రకటనను స్కాన్ చేసిన వెంటనే ఒక ఇంటరాక్టివ్ 3డి వీడియో ప్రారంభమవుతుంది. ఈ వీడియోలో కొత్త షోరూమ్ ప్రారంభోత్సవ వివరాలు, ప్రారంభ సమయంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లను వినియోగదారులకు వివరిస్తుంది. చివర్లో ఇటీవల నటి త్రిష నటించిన జీఆర్‌టీ బ్రాండ్ ఫిల్మ్, కొత్త షోరూమ్ 3డి మోడల్ ప్రదర్శితమవుతుంది. ఈ మిక్స్ డ్ రియాలిటీ యాడ్‌లో స్టోర్ లోకేషన్ ఫీచర్‌ను కూడా చేర్చారు. ఇది వినియోగదారులను యాడ్ నుంచి షోరూమ్ వరకు తీసుకెళ్లడంలో ఉపకరిస్తుంది.
ఫ్లామ్, జీఆర్‌టీ జువెలర్స్ మధ్య ఈ కలయిక రిటైల్ ప్రకటనల్లో కొత్త దశను ప్రారంభిస్తుంది. స్థిరమైన యాడ్ కంటే మిక్స్ డ్ రియాలిటీ ద్వారా వినియోగదారులను ఆకర్షించడంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మిక్స్‌డ్ రియాలిటీ ప్రకటనల అనుభవాలు వినియోగదారుల మనసులను గెలుచుకోవడంలో ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.
జీఆర్టీ జువెలరీ మిక్స్ డ్ రియాలిటీ ప్రకటన విడుదల ఈ సందర్భంగా ఫ్లామ్ సీఈఓ శౌర్య అగర్వాల్ మాట్లాడారు.. మిక్స్డ్ రియాలిటీ అందుబాటులోకి రావడం, ప్రకటనలను మరింత ప్రభావవంతంగా చెప్పడంలో బ్రాండ్లు తీసుకున్న ముందడుగు చాలా సంతోషాన్నిస్తోందన్నారు. జీఆర్‌టీ లాంటి బ్రాండ్ తో పని చేయడం గొప్ప అనుభవమని తెలిపారు. నిరంతరం కొత్తదనం తీసుకురావాలనే వారి ఆలోచన గొప్పదని శైర్య అగర్వాల్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో సరికొత టెక్నాలజీతో ప్రకటనల రూపురేఖలు మార్చి, వినియోగదారులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.
ఈ మిక్స్ డ్ రియాలిటీ ప్రకటన కేవలం ప్రమోషనల్ టూల్ మాత్రమే కాకుండా, మరింత ఆత్మీయంగా, ఆసక్తికరంగా ఉంటూ భవిష్యత్‌లో ప్రకటనల రూపాన్ని మార్చగలదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఫ్లామ్ రూపొందించిన ఈ ‘3ఐ’ (ఇమ్మర్సివ్, ఇంటరాక్టివ్, ఇంపాక్ట్ ఫుల్) ప్రకటనల రంగానికి ఓ సరికొత్త మార్గాన్ని చూపిస్తుందని భావిస్తున్నారు.
మరింత సమాచారం కోసం కింది లింక్ ని క్లిక్ చేయండి. https://www.linkedin.com/posts/flamappofficial_create-innovative-print-ads-in-mixed-reality-activity-7264945967815102464-dzmz?utm_source=share&utm_medium=member_android