చలికాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని చెబుతుంటారు. చలికాలంలో గుండెపోటు బారిన పడేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. చల్లని వాతావరణం గుండె ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోందని నిపుణులు అంటున్నారు. చల్లని వాతవరణం గుండెపై ఒత్తిడిని పెంచుతుంది. చలి గుండె, రక్త ప్రసరణ పనితీరును ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు చల్లని వాతావరణంలో గుండెపోటుకు గురయ్యే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఈ కారణంగా చల్లని వాతావరణంలో తీవ్రమైన గుండె సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. వాతవారణ పరిస్థితులకు, తీవ్రమైన గుండె సమస్యలకు మధ్య ఉన్న సంబంధంపై 2017లో స్వీడన్‌లో ఒక అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా చలికాలంలో శరీరం వేడిగా ఉంచేందుకు గాను గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీంతో గుండె ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇది గుండె సమస్యలు దారి తీసేందుకు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు.
ఎక్కువ చలి ఉంటే.. అధిక రక్తపోటు, ధమనులు గడ్డపడడం వంటివి గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. దీని కారణంగా గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. అదనంగా చలి వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు తీవ్రమవుతాయి. ఇది కూడా గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంటుంది. అయితే గుండెపోటు లక్షణాలను కొన్ని ముందస్తు లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. ముఖ్యంగా ఛాతిలో నొప్పి, భుజంలో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే దవడ నొప్పి కూడా గుండె పోటుకు ముందస్తు లక్షణంగా భావించాలని నిపుణులు అంటున్నారు. అందుకే ఈ లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయుంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..