హోండా యాక్టివా అంటే మధ్య తరగతి ప్రజలు అధికంగా ఇష్టపడే స్కూటర్ ఇప్పుడు యాక్టివా ఈ పేరుతో యాక్టివా ఈవీ వెర్షన్‌ను హోండా లాంచ్ చేసింది. చూడడానికి అచ్చం యాక్టివా ఐసీఈ స్కూటర్ మాదిరిగా ఉన్నా స్టైలింగ్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ స్కూటర్ మినిమలిస్టిక్ విధానంలో ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఇరువైపులా టర్న్ ఇండికేటర్‌లతో ఉంటుంది. హోండా యాక్టివా పొడవాటి సీటుతో చిన్న ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది.
ముఖ్యంగా యాక్టివా ఈ రిమూవబుల్ బ్యాటరీ సెటప్‌తో రెండు 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీలతో వస్తుంది. అందువల్ల చార్జింగ్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ యూనిట్ల ద్వారా శక్తి వీల్-సైడ్ ఎలక్ట్రిక్ మోటారుకు బదిలీ అవుతుంది. ఇది 4.2 కేడబ్ల్యూ పవర్ అవుట్‌పుట్‌ని కలిగి ఉంటుంది. ఈ అవుట్‌పుట్ గరిష్టంగా 6.0 కేడబ్ల్య వరకు పెంచుకోవచు. హోండా యాక్టివా-ఈ స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 102 కిమీల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్‌లో స్టాండర్డ్, స్పోర్ట్, ఎకాన్ వంటి రైడింగ్ మోడ్‌లు ఉంటాయి.
హోండా క్యూసీ-1
హోండా క్యూసీ-1 భారతదేశంలో 2025 మధ్యలో నుంచి ప్రత్యేకంగా విడుదల చేయనున్నారు. ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికుల ఈ స్కూటర్ రూపొందించారు. ఈ స్కూటర్ కూడా యాక్టివా-ఈ డిజైన్ మాదిరిగా ఉన్నాయి. ఈ స్కూటర్ ఆప్రాన్, వాహనానికి సంబంధించిన సైడ్ ప్యానెల్‌లు ఆకట్టుకుంటాయి.అయితే యాక్టివా-ఈ మాదిరి డీఆర్‌ఎల్‌లు లేకపోవడంతో స్కూటర్ కొంచెం భిన్నంగా కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి
క్యూసీ – 1 స్థిరమైన 1.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది ఫ్లోర్‌బోర్డ్‌పై ఉంచిన సాకెట్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేసేలా ప్రత్యేక ఛార్జర్‌తో వస్తుంది. క్యూసీ-1 స్కూటర్‌ను ఓ సారి చార్జ్ చేస్తే 80 కిలో మీటర్ల పరిధిని అందిస్తుంది. క్యూసీ-1 ఐదు అంగుళాల ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌తో వస్తుంది. ఈ ఈవీ స్కూటర్‌లో అండర్-సీట్ స్టోరేజ్, యూఎస్‌బీ టైప్-సీ సాకెట్ వంటి అధునాతన ఫీచర్లు ఆకట్టుకుంటాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి