తేనె గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. తేనె గురించి చిన్న పిల్లలకు కూడా తెలుసు. తేనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తేనెను ఎన్నో రకాల సమస్యలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. తేనెలో శరీరానికి కావాల్సిన పోషకాలు చాలానే ఉన్నాయి. కేవలం ఆరోగ్యానికే కాకుండా తేనెతో అందాన్ని కూడా పెంచుకోవచ్చు. తేనెతో చర్మ, జుట్టు అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. తేనె తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. గాయాలను కూడా తేనె త్వరగా నయం చేస్తుంది. అదే విధంగా జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. తేనెతో ఉండే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అయితే తేనెతో చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కానీ తేనెను నేరుగా ముఖంపై రాయవద్దని అంటారు. కానీ తేనె వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కేవలం అలెర్జీ సమస్యతో బాధ పడేవారు మాత్రమే ప్యాచ్ టెస్ట్ చేసుకుని యూజ్ చేయండి. మరి ముఖానికి తేనె పెట్టడం వల్ల ఎలాంటి లాభాఉ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
మొటిమలు పోతాయి:
మొటిమల సమస్యలతో ఇబ్బంది పడేవారు తేనె ముఖానికి రాయడం వల్ల త్వరగా వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉననాయి. ఇవి చర్మంపై ఉండే బ్యాక్టీరియాను, మచ్చలను తగ్గిస్తుంది. కాబట్టి మొటిమలతో ఇబ్బంది పడేవారు తేనె రాసుకోవచ్చు.
ఎక్స్‌పోలియేట్ చేస్తుంది:
తేనె చర్మాన్ని ఎక్స్‌పోలియేట్ చేస్తుంది. అంటే చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుది. తేనెలో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్.. నేచురల్ ఎక్స్‌పోలియేటర్స్‌గా పని చేస్తాయి. డ్రై స్కిన్‌తో ఇబ్బంది పడేవారు తేనె రాసుకుంటే సాఫ్ట్‌గా, హైడ్రేట్‌గా మారుతుంది. చర్మం తాజాగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి
యవ్వనంగా ఉంటారు:
ముఖానికి తేనె రాయడం వల్ల ఎప్పుడూ యవ్వనంగా మెరిసిపోతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. కాబట్టి చర్మంపై ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అంతే కాకుండా వృద్ధాప్య ప్రక్రియను కూడా నెమ్మదిస్తుంది.
క్లియర్‌గా స్కిన్:
తేనె చర్మానికి రాసుకోవడం వల్ల అందంగా మారుతుంది. మచ్చలు, మొటిమలు, ముడతలు, గీతలు లేకుండా చర్మం ఎంతో క్లియర్‌గా కాంతివంతంగా మారుతుంది. పిగ్మెంటషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది. యవ్వనంగా ఉంటారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.