దిన ఫలాలు (జనవరి 24, 2025): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక లాభాలు ఎక్కువగా కలుగుతాయి. ఆదాయ మార్గాలన్నీ ఆశించిన ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. అధికారులకు మీ సమర్థత మీద బాగా నమ్మకం పెరుగుతుంది. వృత్తి జీవితం కూడా చాలావరకు ఉత్సాహంగానే, ప్రోత్సాహకరంగానే సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి తీరిక ఉండదు. వ్యాపారాల్లో లాభాలకు ఇబ్బందేమీ ఉండదు. ఏ రంగంలో ఉన్నప్పటికీ పురోగతి ఉంటుంది. కుటుంబ విషయాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఎంతో కష్టపడి ఆదాయాన్ని వృద్ధి చేసుకున్నప్పటికీ, అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బంది పడే అవ కాశం ఉంది. షేర్లు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వల్ల లాభాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఆరోగ్యానికి లోటుండదు. ఉన్నత స్థాయి వ్యక్తులతో స్నేహాలు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ప్రతి పనిలోనూ, ప్రయత్నంలోనూ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆస్తి వివాదం అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో పురోగతి చెందుతాయి. ఆదాయానికి లోటుండదు. విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగ జీవితానికి ఇబ్బందేమీ ఉండదు. అధికారులకు మీ పని తీరు సంతృప్తి కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు కూడా సజావుగా సాగిపోతాయి. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. ఇంటా బయటా శ్రమ, ఒత్తిడి తప్పకపోవచ్చు. అనుకున్న పనులన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం చేసినా సవ్యంగా పూర్తవుతుంది. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. వ్యక్తిగత సమస్య లకు పరిష్కారం లభిస్తుంది. విద్యార్థులు శ్రధ్ధ పెంచాల్సి ఉంటుంది. ప్రేమ విషయాలు రొటీనుగా సాగుతాయి.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపా రాల్లో లాభాలు కొద్దిగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యమైన వ్యవహా రాలు నిదానంగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవాభిమానాలకు కొరత ఉండకపోవచ్చు. ఆర్థిక వ్యవహారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫల మవుతాయి. విద్యార్థులు కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం చాలా మంచిది. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సాఫీగా సాగిపోతాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. దాంపత్య జీవితంలో సఖ్యత, సాన్నిహిత్యం మరిం తగా పెరుగుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రయాణాల వల్ల లాభముంటుంది. ఆదాయం కొద్దిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రాభవం పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది కానీ, ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. డబ్బు ఇవ్వడం, తీసు కోవడం వంటివి పెట్టుకోవద్దు. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం అవసరం. కొన్ని ముఖ్యమైన పనులు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
ఆదాయానికి లోటుండకపోవచ్చు. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఒకరిద్దరికి సహాయం చేయడం కూడా జరుగుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా మాటకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు బిజీగా సాగిపోతాయి. ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. కుటుంబంలో సుఖసంతోషాలకు కొరత ఉండదు. విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
కొద్దిగా కష్టపడ్డా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఆదాయ ప్రయత్నాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ధనపరంగా ఎవరికీ ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి అడుగులు వేయవలసి ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా డిమాండ్ పెరుగుతుంది. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. కొందరు బంధుమిత్రుల వల్ల కొద్దిగా ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయట పడే అవకాశముంది. విద్యార్థులకు కొద్దిగా శ్రమ తప్పదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.