Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

2 hours ago 1

దిన ఫలాలు (నవంబర్ 16, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పై అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొద్దిగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి జీవితంలో ఉన్నవారికి విశేషమైన లాభాలు అందుతాయి. ఆదాయపరంగా ఏ ప్రయత్నమైనా సత్ఫలితాలనిస్తుంది. ఉద్యోగాల్లో కొద్దిపాటి పురోగతి కలుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. వ్యాపార వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్దాసక్తులు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత, సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

అనుకోకుండా ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి కారణమవుతున్న ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడే అవకాశముంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆదాయం అనుకూలంగా ఉన్నప్పటికీ అనుకోని ఖర్చుల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. శ్రమ, తిప్పట ఉన్నా ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ప్రయాణాల వల్ల లాభముంటుంది. కొందరు బంధుమిత్రుల వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి.. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా సాగి పోతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలని స్తాయి. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అపార్థాలు తలెత్తుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమ స్యల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. బంధుమిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు సంతృప్తి కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యా త్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. వృత్తి జీవితంలో తీరిక ఉండకపోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు నిలకడగా సాగుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో కూడా బాధ్యతలు మారిపోయే అవకాశం ఉంది. పని భారం బాగా తగ్గుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో విందుల్లో పాల్గొంటారు. ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. మంచి స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. బంధుమిత్రులతో కూడా అపా ర్థాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం సంతృ ప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు పురోగతి సాధిస్తాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఆశించిన ప్రోత్సాహ కాలను అందుకుంటారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా అప్రమత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగా పెరుగు తుంది. ముఖ్యమైన పనుల్ని సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

కొందరు ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయ ప్రయత్నాలు విజయ వంతం అవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆటంకాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు చాలావరకు సజావుగా సాగిపోతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలున్నా మిత్రుల సహకారంతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఉద్యో గాల్లో పనిభారం ఉన్నా ఫలితం ఉంటుంది. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

మంచి కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యో గాలు సానుకూలంగా సాగిపోతాయి. సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు తప్పకుండా ఉద్యోగ యోగం పడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలతలు బాగా పెరుగుతాయి.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article