లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే చాలు మీ పనైపోయినట్టే.. నిబంధనలకు పాతరేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇలా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏకంగా వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఓ అధికారి.
Acb Raids
లంచం ఇస్తే చాలు మీ పని ఐపోతుంది.. ఎక్కడ కావాలంటే అక్కడ భవనాలు నిర్మించుకునేందుకు అనుమతి లభిస్తుంది. అది బఫర్‌జోన్ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా లంచం ఇస్తే చాలు మీ పనైపోయినట్టే.. నిబంధనలకు పాతరేసి పర్మిషన్ ఇచ్చేస్తారు. ఇలా ఆమ్యామ్యాలకు అలవాటు పడి ఏకంగా వంద కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు ఓ అధికారి. తాజాగా ఏసీబీ వలకు చిక్కాడు. హైదరాబాద్‌లో ఇరిగేషన్ మాజీ AEE నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు మెరుపు దాడులు చేశారు. ఏకకాలంలో హైదరాబాద్‌తో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 20 చోట్ల సోదాలు నిర్వహించారు. నిఖేష్ బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిఖేష్ 150 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించినట్టు గుర్తించారు. నిఖేష్ పేరుతో మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలు ఉన్నట్టు గుర్తించారు ఏసీబీ అధికారులు. మూడు ఫామ్‌హౌస్‌ల విలువ 80 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటితోపాటు.. చాలా ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నాడు నిఖేష్. గతంలో కూడా లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. ఆరు నెలల క్రితం లక్ష రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. గండిపేట బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయి సోదాల తర్వాత నిఖేష్ అక్రమాస్తులు భారీగా బయటపడే అవకాశం ఉంది.