ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడో ఓ చోట లూప్ పట్టేస్తున్నారు. ఖాతాల్లోని సొమ్మును లాగేస్తున్నారు. ఇక అజాగ్రత్తగా ఉంటే ఖేల్ ఖతం. డిజిటల్ అరెస్టులు దగ్గర్నుంచి.. ఓటీపీలు, కేవైసీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాండంత అవుతుంది. ఇప్పుడు నయా ఐడియాతో ముందుకు వచ్చారు సైబర్ క్రిమినల్స్. మెయిల్స్‌లో అక్షరాలు కొద్దిగా మార్చి దోపిడీలకు తెగబడుతున్నారు. తాజాగా ఇలానే ఓ కంపెనీని రూ. 10 కోట్లు ముంచేశారు. పూర్తి డీటేల్స్‌లోకి వెళ్తే… హైదరాబాద్‌కు చెందిన సదరు కంపెనీ.. హాంకాంగ్ నుంచి తమకు కావాల్సిన ముడిసరుకు పర్చేజ్ చేస్తుంది. ట్రాన్‌జాక్షన్స్ అన్ని ఈమెయిల్ ద్వారానే జరుపుతుంటారు. హాంకాంగ్ సంస్థ తరఫున… robert@gmail.com ద్వారా హైదరాబాద్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యేవారు. ఇటీవల సరుకు వచ్చిన తర్వాత ఒకరోజు హైదరాబాద్ సంస్థకు మెయిల్ వచ్చింది. ఆడిట్ కారణాల వల్ల తమ బ్యాంకు ఖాతా మార్చాల్సి వచ్చిందని మెయిల్‌లో పేర్కొన్నారు. తమకు రావాల్సిన నగదును కొత్త బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించారు.
దీంతో ఆ మెయిల్ వివరాల ఆధారంగా.. హైదరాబాద్ సంస్థ కొత్త ఖాతాకు డబ్బు పంపింది. నగదు పంపిన… వారం తర్వాత తమకు ఇంకా డబ్బు అందలేదని హాంకాంగ్ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం ఇచ్చింది. దాంతో ఖంగుతున్న హైదరాబాద్ సంస్థ ఉద్యోగులు వారం క్రితమే తాము డబ్బు ట్రాన్స్‌ఫర్ చేశామని అందుకు సంబంధించిన డీటేల్స్ పంపారు. అయితే ఆ అకౌంట్‌తో తమకు సంబంధదం లేదని.. వేరే ఖాతాకు డబ్బు పంపాలని తామేం చెప్పలేదని హాంకాంగ్ సంస్థ వెల్లడించింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధిత కంపెనీ.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టి సైబర్ కేటుగాళ్ల పనిగా తేల్చారు.
హాంకాంగ్ సంస్థ సర్వర్‌ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్.. లావాదేవీలకు సంబంధించిన డీటేల్స్ కంప్లీట్‌గా తెలుసుకున్నారు. అన్ని వివరాలపై గ్రిప్ పట్టేసి.. అదే సంస్థ నుంచి మెయిల్ పంపుతున్నట్లు ఫేక్ మెయిల్ ఐడీ క్రియేట చేసి.. తమ బ్యాంకు ఖాతా మార్చుతున్నట్లు హైదరాబాద్ సంస్థకు మెయిల్ పంపారు. అందుకు తగ్గట్లుగా robert@gmail.com కు బదులుగా rabert@gmail.com అనే మెయిల్ ఐడీ క్రియేట్ చేశారు. కేవలం ఒక్క అక్షరం మార్చడంతో.. పెద్దగా తేడా అనిపించదు కాబట్టి ఈ పనికి పూనుకున్నారు. ఇది గమనించని హైదరాబాద్ సంస్థ సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.10 కోట్లు పంపేసింది. ఇలా మాస్టర్ మైండ్ తెలివితేటలు వాడి.. కేవలం ఒక్క అక్షరం ఛేంజ్ చేసి.. .. ఒక్క అక్షరమాన్ని మార్చి రూ. 10 కోట్లు కొట్టేశారు. ఇలాంటి తరహా మోసాలు పెరిగాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మెయిల్స్, బ్యాంకు ఖాతా నెంబర్లు, ఫోన్ నెంబర్లను ఒకటికి రెండు సార్లు సరిపోల్చుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..