డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ. ఇదీ రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్. ఈ క్రమంలో అనేక చర్యలు చేపట్టినా.. చాప కింద నీరులా గంజాయి సరఫరా అవుతున్నాయి. ఏకంగా ఇళ్ల మధ్యనే గంజాయి మొక్కలను పెంచుతూ పట్టుబడింది ఓ కుటుంబం. ఈ ఘటన హైదరాబాద్ శివారు ప్రాంతంలో వెలుగు చూడటంతో తీవ్ర కలకలం రేపుతోంది.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలు పెంచుతున్నారన్న సమాచారంతో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా దాడులు చేశారు. ఆ ప్రాంతంలో అనేక హాస్టల్స్ ఉన్నా.. వాటన్నింటి మధ్య గుట్టు చప్పుడు కాకుండా గంజాయి మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకం. ఇటీవల ఇంజినీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ప్రాంతానికి 30 మీటర్ల దూరంలోనే ఈ గంజాయి మొక్కలను పెంచుతుండటం పోలీసులను షాక్‌కు గురి చేసింది.
మంగళ్‌పల్లి గేటు, నాగార్జున సాగర్ రహదారికి అనుకొని ఉన్న రేకుల షెడ్‌లో ఈ మొక్కల పెంపకం సాగుతోంది. ఈ గంజాయిని ఎవరు పెంచుతున్నారనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. చుట్టూ ఇంజనీరింగ్ కాలేజీలు, హాస్టల్స్ మధ్య గంజాయి మొక్కలు దర్శనం ఇవ్వడం చూసి పోలీసులే షాక్‌కు గురయ్యారు. బీహార్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఈ రేకుల షెడ్డులో నివాసం ఉంటోంది. ఆ షెడ్డు పరిసరాల్లో ఈ గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..