ఓ మనిషి డిప్రెషన్‌లో ఉంటే.. తనకు తాను హాని తలపెట్టడం.. ఇతరులకు హాని చేయడం వంటివి చేస్తుంటారు. అందుకే డిప్రెషన్ మహమ్మారిని అస్సలు లైట్ తీసుకోవద్దు. తాజాగా ఓ వ్యక్తి.. తాత తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని ఏకంగా ఆయన్ను చంపేశాడు. ఈ ఘటన పంజాగుట్ట పీఎస్ లిమిట్స్‌లో వెలుగుచూసింది. వెలమటి చంద్రశేఖర జనార్ధన్ (86) తన కూతురు సరోజినీతో కలిసి బీఎస్ మక్తాలో నివాసముంటున్నారు. ఆయన మనవడు తేజ (30) అమెరికాలో MS కంప్లీట్ చేసి ఇటీవలే హైదరాబాద్ రిటన్ వచ్చాడు. తేజ ప్రస్తుతం ల్యాంకో హిల్స్‌లో ఉంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా అతను డిప్రెషన్‌కు లోనవుతున్నట్లు సమాచారం.
తన తాత అందరిలో తనను పిలవడం లేదని, తనను సరిగ్గా చూడటం లేదని, దూరం పెడుతున్నారని కక్ష పెంచుకున్నాడు తేజ. ఆయన్ను లేపేయాలని ప్లాన్ చేశాడు. గురువారం రాత్రి తాత ఇంటికి వెళ్లిన తేజ ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం ఆయన్ను కత్తితో పొడిచాడు. అడ్డుకోబోయిన తల్లి సరోజినిని సైతం కత్తితో గాయపరిచారు. ఈ ఘటనలో తాత స్పాట్‌లో చనిపోయాడు. గమనించిన స్థానికులు సరోజినిని లోకల్‌గా ఉన్న ఆస్పత్రికి తలరించారు. పంజాగుట్ట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి… నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అందుకే మీకు తెలిసి చుట్టుపక్కలవారు ఎవరైనా యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. కౌన్సిలింగ్ ఇప్పించి.. చికిత్స అందేలా చేయండి. పరిస్థితి ముదిరితే.. వారితో పాటు ఇతరులకు కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.