అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్ధులు 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి వచ్చే ఏడాది మర్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యేందుకు పరీక్ష ఫీజు చెల్లింపు గడువు మరోమారు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు క్రితిక శుక్లా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 5 వరకు పొడిగించినట్లు ఆమె తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుమూ లేకుండా డిసెంబర్ 5వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. ఇంటర్ (జనరల్, ఒకేషనల్) ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు, ప్రైవేట్ (ఫెయిలైన) విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు చొరవ తీసుకుని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఇదే చివరి అవకాశం అని స్పష్టం చేశారు.
ఇంటర్ మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న జనరల్, ఒకేషనల్ విద్యార్థులు సబ్జెక్టులతో సంబంధం లేకుండా జనరల్, ఒకేషనల్ కోర్సులకు రూ.1200 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. సబ్జెక్టుల సంఖ్యతో సంబంధం లేకుండా మొదటి, ద్వితియ సంవత్సరం జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.550 ఫీజు చెల్లించాలి. రెండు సంవత్సరాల జనరల్, ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు సబ్జెక్టు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రూ.330 చెల్లించాలి. ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించి మార్కుల్లో పురోగతి కోసం మొదటి, ద్వితియ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార‌్థులు ఆర్ట్స్ గ్రూపులైతే రూ.1350, సైన్స్ గ్రూపులైతే రూ.1600 ఫీజు చెల్లించాలి.
ఏపీ సివిల్ జడ్జి పోస్టుల ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. ఎంపిక జాబితా ఇదే
ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) నియామక పరీక్ష ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ మేరకు ప్రొవిజినల్ ఎంపిక జాబితాను ఏపీ స్టేట్ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్లో వెల్లడించింది. మొత్తం 12 మంది ఎంపికయ్యారు. కాగా ఈ ఏడాది జనవరిలో సివిల్ జడ్జి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా.. ఏప్రిల్‌లో రాత పరీక్షలు జరిగాయి. నవంబర్ మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. స్క్రీనింగ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వాయిస్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఎట్టకేలకు ఎంపిక జాబితా విడుదల చేశారు.
ఇవి కూడా చదవండి
ఏపీ సివిల్ జడ్జి ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.