ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. IPL ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో విపరీతమైన పాపులారిటీ ఉంది. ఇది భారతీయులకే కాదు, లీగ్‌లో ఆడిన విదేశీ ఆటగాళ్లకు కూడా ఎన్నో అవకాశలను కూడా తెచ్చిపెట్టింది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు స్టేడియాలకు తరలివస్తున్న అభిమానుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తుంది. సీజన్లు గడిచేకొద్దీ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే ధర కూడా విపరీతంగా పెరిగింది. 2024 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను రూ. 24.75 కోట్లకు సొంతం చేసుకుంది. మరి 2025 ఐపీఎల్ వేలంలో ఏమి జరుగుతుందో వేచి చూడాలి..
ప్రతి సీజన్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు:
ఎంఎస్ ధోని(2008)-9.5 కోట్లు
కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్(2009)-9.8 కోట్లు
కీరన్ పొలార్డ్, షేన్ బాండ్(2010)-4.8 కోట్లు
గౌతమ్ గంభీర్(2011)-14.9 కోట్లు
రవీంద్ర జడేజా(2012)-12.8 కోట్లు
గ్లెన్ మాక్స్‌వెల్ (2013)-6.3 కోట్లు
యువరాజ్ సింగ్(2014)-14 కోట్లు
యువరాజ్ సింగ్(2015)- 14 కోట్లు
షేన్ వాట్సన్(2016)- 9.5 కోట్లు
బెన్ స్టోక్స్(2017)- 14.5 కోట్లు
బెన్ స్టోక్స్(2018)- 12.5 కోట్లు
జయదేవ్ ఉనద్కత్, వరుణ్ చక్రవర్తి(2019)- 8.4 కోట్లు
పాట్ కమిన్స్(2020)- 15.5 కోట్లు
క్రిస్ మోరిస్(2021)- 16.25 కోట్లు
ఇషాన్ కిషన్(2022)- 15.25 కోట్లు
సామ్ కర్రాన్(2023)- 18.5 కోట్లు
మిచెల్ స్టార్క్(2024)- 24.75 కోట్లు
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి