Jammu Kashmir: కిష్త్వార్‌లో ఇద్దరు గ్రామ రక్షణ గార్డులను కిడ్నాప్ చేసి చంపిన ఉగ్రవాదులు.. అనాగరిక చర్య అన్న సిఎం ఒమర్ అబ్దుల్లా

2 hours ago 1

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో తాజాగా ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఉగ్రవాదుల దాడిలో విలేజ్ డిఫెన్స్ గ్రూప్ (VDG)కి చెందిన ఇద్దరు సభ్యులు మరణించారు. వీరి మృతదేహాలను భద్రతా బలగాలు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. మరోవైపు విలేజ్‌ డిఫెన్స్‌ గ్రూప్‌ సభ్యులు నజీర్‌ అహ్మద్‌, కులదీప్‌ కుమార్‌ల మృతదేహాల కోసం పోలీసులు పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. వీరిద్దరూ పశువులను మేపేందుకు సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగి రాలేదు.

కాగా కిష్త్వార్‌లో ఇద్దరు వీడీజీ సభ్యుల హత్యను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన తండ్రి ఫరూక్ అబ్దుల్లా ఖండించారు. జమ్మూ కాశ్మీర్‌లో దీర్ఘకాలిక శాంతిని నెలకొల్పేందుకు ఇటువంటి అనాగరిక హింసాత్మక చర్యలు ఒక ముఖ్యమైన అడ్డంకిగా మారాయని ఆయన అన్నారు. ఇది చాలా దుఃఖాన్ని కలుగజేస్తోందని.. మృతుల ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేస్తున్నానని.. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

JKNC President Dr Farooq Abdullah and VP & Chief Minister @OmarAbdullah person condemned the gruesome sidesplitting of 2 colony defence guards successful Kishtwar namely Nazir Ahmad and Kuldeep Kumar, successful a wood area. They person said that specified acts of barbaric unit stay a significant…

— JKNC (@JKNC_) November 7, 2024

ఈ హత్యకు కాశ్మీర్ టైగర్స్ బాధ్యత వహించారు

ఈ హత్యకు కాశ్మీర్ టైగర్లు బాధ్యత వహించారు. కాశ్మీర్ టైగర్స్ విడుదల చేసిన ఒక ప్రకటనలో వీడీజీకి చెందిన ఇద్దరు చురుకైన సైనికులు కుల్దీప్ కుమార్, నజీర్ ముజాహిదీన్ ఇస్లాంను వెంబడిస్తూ కిష్త్వార్ ప్రాంతానికి చేరుకున్నారు. కాశ్మీర్‌లోని ముజాహిదీన్‌లు మొదట వారిని పట్టించుకోలేదు. అయితే తమకు దగ్గరగా వచ్చిన తర్వాత ముజాహిదీన్‌లు వారిని పట్టుకున్నారు. ఆ ఇద్దరూ తమ నేరాలను అంగీకరించారు. ఆ తర్వాత శిక్ష అనుభవించారు అంటూ పేర్కొన్నారు.

కాశ్మీర్ టైగర్స్

ఈ ప్రాంతంలో కొన్ని నెలలుగా పెరిగిన తీవ్రవాద కార్యకలాపాలు

ఈ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా తీవ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ ప్రాంతంలో కనీసం రెండు పర్యాయాలు ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. కాగా వీడీజీలు ఇద్దరూ ఉదయం జంతువులతో కలిసి చత్రులోని కుంత్వాడ అడవులకు వెళ్లినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సాయంత్రం వరకు వారు తిరిగి రాలేదు. గ్రామస్థులు పోలీసులను సంప్రదించేలోపే.. ఉగ్రవాదులు ఇద్దరు వీడీజీల ఛాయాచిత్రాలను విడుదల చేసి.. వీరిని చంపినట్లు వెల్లడించారు.

కుల్దీప్ కుమార్ సోదరుడు పృథ్వీ మాట్లాడుతూ.. అహ్మద్‌తో పాటు తన సోదరుడిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి చంపినట్లు మాకు సమాచారం అందింది. అతను VDG.. ఎప్పటిలాగే పశువులను మేపడానికి వెళ్ళాడు. ఇంతలోనే మరణ వార్త వినాల్సి వచ్చింది అని చెప్పారు. మృత దేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని.. అయితే మృతుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదన్నారు. తన తండ్రి అమర్ చంద్ వారం రోజుల క్రితమే మరణించారని.. ఇప్పుడు తన సోదరుడి మరణ వార్త తమ కుటుంబానికి మరో పెద్ద దెబ్బ అని పృథ్వీ అన్నారు.

సోపోర్‌లో ఎన్‌కౌంటర్..

మరోవైపు ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్‌లోని సాగిపోరా ప్రాంతంలో కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ సమయంలో కొన్ని తుపాకీ కాల్పులు వినిపించాయి. దీంతో పోలీసులు, సైన్యం కలిసి సంయుక్త బృందం గురువారం సాయంత్రం సాగిపోరాలో కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిందని ఒక పోలీసు అధికారి తెలిపారు.

OP PANIPURA, #Baramulla

On 07 Nov 24, based connected circumstantial quality regarding beingness of terrorists, a associated Operation launched by the #IndianArmy & @JmuKmrPolice successful Panipura, Sopore, #Baramulla. Suspicious enactment was observed by vigilant troops and connected being challenged… pic.twitter.com/BXT76uwqVZ

— Chinar Corps🍁 – Indian Army (@ChinarcorpsIA) November 7, 2024

సోదాల సమయంలో కొన్ని తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత ఆ ప్రాంతం చుట్టూ భద్రతా వలయాన్ని కట్టుదిట్టం చేశామని చెప్పారు. జాయింట్ భద్రతా దళాలు సోపోర్‌లో భారీ కార్డన్ ఆన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ తర్వాత ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా వలయంలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article